Talliki Vandanam: తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే..
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది.
Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది.
ఈ ఏడాది తల్లికి వందనం అమలుకు చంద్రబాబు సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలక ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. జూన్ 12వ తేదీ కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్ లో చేర్చాలి. లేదంటే తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా ఇద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకొస్తారు. ఇక, ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుండి ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఇదే పరిశీలన వర్తిస్తుంది. డేటా వెరిఫికేషన్ సకాలంలో కచ్చితంగా పూర్తి చేయకపోతే అర్హులైన విద్యార్థులకు నిధులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ఈ 5 రకాల సమస్యలను పరిష్కరించి వెరిఫికేషన్ పూర్తి చేశాకే తుది అర్హుల జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాత నిధులు విడుదలవుతాయి.
బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ అయితేనే..
తల్లికి వందనం లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాకపోతే డబ్బులు పడవు. గతేడాది చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు పొందలేకపోయారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను ఇప్పటికే అలర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని సూచించింది.
బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి..
https://uidai.gov.in/en/ సైట్ కి వెళ్లాలి.
మై ఆధార్ విభాగానికి వెళ్లి ఆధార్ సర్వీసెస్ కింద బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఎంపిక చేసుకోవాలి.
12 అంకెల ఆధార్ నెంబర్‌తో పాటు క్యాప్చా నమోదు చేయాలి.
సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేశాక స్క్రీన్‌పై ఆధార్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో కనిపిస్తుంది.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘తల్లికి వందనం’ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా… ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు, మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం జమ చేస్తున్నారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘తల్లికి వందనం’ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా… ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు, మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం జమ చేస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా, మొబైల్ కి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మ్యాపింగ్ కూడా కీలకమే. అర్హులైన వారు బ్యాంకుకి వెళ్లి ఖాతా స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఒకదానితో ఒకటి లింకై ఉండాలి.
Also Read: ఏపీ సర్కార్ శుభవార్త… జూన్ 1న ఆ 62,34,445 మందికి డబ్బు..
