బీజేపీ నేతల వరుస మరణాలు : చేతబడి కారణమా..?

వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బీజేపీ నేతల వరుస మరణాల గురించి సంచలన ఆరోపణలు చేశారు. దీనిక వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న ఆమె.. చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ జ్యోతిష్య పండితుడు గతంలోనే తనతో చెప్పాడని ఆమె గుర్తు చేశారు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు జరుగుతోందని, బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు.
గత 2 నెలల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 26,2019) ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్రపూజలు చేయిస్తున్నాయని తనకు గతంలోనే ఒక జ్యోతిష్యుడు చెప్పాడని సాధ్వి తెలిపారు. కాకపోతే ఆ విషయం మర్చిపోయానని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. జ్యోతిష్యుడు చెప్పినట్టుగా బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు. నాడు జ్యోతిష్యుడు చెప్పింది ఇప్పుడు నిజమని నమ్మాల్సి వస్తోందన్నారు.
”ముందు ముందు బీజేపీకి బ్యాడ్ టైమ్ వస్తుందని కొన్ని రోజుల క్రితం ఓ జ్యోతిష్య పండితుడు చెప్పారు. ప్రతిపక్షం ఏదో చేస్తోందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా మారక్ శక్తి(క్షుద్ర పూజలు) జరుగుతున్నాయని హెచ్చరించారు. కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. నాడు జ్యోతిష్య పండితుడు చెప్పింది నిజమేనని నమ్మాల్సి వస్తోంది” అని సాధ్వి అన్నారు.
#WATCH Pragya Thakur,BJP MP: Once a Maharaj ji told me that bad times are upon us&opposition is upto something, using some ‘marak shakti’ against BJP.I later forgot what he said,but now when I see our top leaders leaving us one by one,I am forced to think,wasn’t Maharaj ji right? pic.twitter.com/ZeYHkacFJj
— ANI (@ANI) August 26, 2019