Varun Gandhi
Lakhimpur incident video share : లఖింపూర్ ఖేరి… ఇప్పుడు దేశమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. రాజకీయ పార్టీలన్నీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇవి ముమ్మాటికీ హత్యలేనంటూ ఇప్పటి వరకూ ప్రతిపక్షాలే ఆరోపిస్తూ వస్తున్నాయి. తాజాగా సొంత పార్టీ ఎంపీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటోంది బీజేపీ. లఖింపూర్ వీడియోను ఆయన కూడా షేర్ చేశారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ ఎంపీ వరణ్‌గాంధీ లఖింపూర్ వీడియోను షేర్ చేస్తూ.. వారు హత్యకు గురయ్యారంటూ పేర్కొన్నారు.
ఈ వీడియో చాలా స్పష్టంగా ఉందని, హత్యలు చేస్తే నిరసనకారులు మౌనంగా ఉంటారనుకోవద్దని పేర్కొన్నారు వరుణ్‌గాంధీ. అమాయక రైతుల రక్తమరకలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, రైతులకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు. ప్రతి రైతు మైండ్‌లో ప్రతీకారం, క్రూరత్వం పెరగక ముందే న్యాయం జరగాలని పేర్కొన్నారు వరణ్‌గాంధీ.
Uttar Pradesh : లఖింపూర్ ఘటనపై యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రైతులు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుండగా… వెనుక నుంచి వచ్చిన వాహనం వేగంగా వచ్చి ఢీకొందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. హత్యలు చేస్తే నిరసకారులు మౌనంగా ఊరుకోరన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా బాధ కలుగుతుందని అన్నారు.