BJP offers 5 autos as gift to Kejriwal
BJP Offers 5 Autos To Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు భారతీయ జనతా పార్టీ ఐదు ఆటోలు బహుమతిగా ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో ప్రయాణం చేస్తూ పోలీసులతో కేజ్రీవాల్ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు ఆటోలతో ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి గురువారం బీజేపీ వెళ్లారు. ఢిల్లీ రోడ్లపై కేజ్రీవాల్ ఇదే ఆటోలో తిరగాలనుకుంటే తిరగొచ్చని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా గుజరాత్ ఆటో ప్రయాణాన్ని డ్రామాగా కొట్టిపారేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేజ్రీవాల్ కాన్వాయ్‌లో 27 వాహనాలు ఉంటాయని, కానీ ఆయన ఆటోలో ప్రయాణం కోసం పోలీసులతో గోడవ పడడం ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టడానికేనని ఢిల్లీ బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధురి విమర్శించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. ఒక ఆటో డ్రైవర్ ఆహ్వానం మేరకు కేజ్రవాల్ ఆటోలో వెళ్లి సదరు ఆటోవాలా ఇంట్లో డిన్నర్ చేశారు. అయితే ఆటోవాలా ఇంటికి ఆటోలోనే కేజ్రీవాల్ వస్తుంటే గుజరాత్ పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా సమస్యల కారణంగా ఆటో ప్రయాణం వద్దని వారించారు. ఆ సందర్భంలోనే పోలీసులతో కేజ్రివాల్ వాగ్వాదానికి దిగారు.
Edappadi Palaniswami: అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రికి చుక్కెదురు