Edappadi Palaniswami: అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రికి చుక్కెదురు

రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పళనిస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ ఉత్తర్వులు రద్దు చేసి, కేసు మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది.

Edappadi Palaniswami: అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రికి చుక్కెదురు

Madras High Court Rejects Edappadi Palaniswami Plea Over Money Laundering Case

Edappadi Palaniswami: అవినీతి కేసులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి చుక్కెదురైంది. రహదారులశాఖ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తనపై అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ వేసిన పిటిషన్‭ను ధర్మాసనం తోసి పుచ్చింది. అంతే కాకుండా అవసరమైతే అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని స్పష్టం చేసింది.

రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పళనిస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ ఉత్తర్వులు రద్దు చేసి, కేసు మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నేపథ్యంలో టెండర్‌ అవినీతి కేసులో బదులు పిటిషన్‌ వేసే వరకు ఏసీబీ తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించాలని కోరుతూ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా అవినీతి కేసులో ప్రాథమిక విచారణ నివేదిక ఏసీబీ కమిషనర్‌ వద్ద ఉందని ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు. ఈ స్థాయిలో కేసు నిలుపుదల చేయడం సబబు కాదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈపీఎస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Modi – Owaisi : మోడీ చిరుతపులి కంటే వేగంగా ఎస్కేప్ అవుతారు : ప్రధానిపై ఎంపీ ఓవైసీ సెటైర్