VD Savarkar's portrait (1)
Karnataka Assembly VD Savarkar’s Portrait : కర్ణాటక అసెంబ్లీలో అధికారి బీజేపీ వీడీ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించింది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ తీరుపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సావర్కర్ చిత్ర పటాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో వాల్మీకి, బసవన్న, కనకదాస, డా.బీఆర్ అంబేద్కర్, సర్దార్ వర్లబాయ్ పటేల్ వంటి మహనీయుల చిత్ర పటాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ మేరకు స్పీకర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అసెంబ్లీలో వారి అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేజీ అసెంబ్లీలో వీడీ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించి వివాదం రేపిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు మండిపడుతున్నారు.