Bypoll Results 2023: 7 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో భిన్న ఫలితాలు. త్రిపురలో బీజేపీ, యూపీలో ఇండియా

త్రిపురలోని బోక్సానగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హొస్సేన్ విజయం సాధించారు. అలాగే ధాంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ అభ్యర్థి బిందు దేబ్ నాథ్ విజయం సాధించారు.

Bypoll Results 2023: పలు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భిన్న ఫలితాలు కనిపించాయి. త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో అధికార భారతీయ జనతాపార్టీయే విజయం సాధించింది. అయితే యూపీలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల్లు జరగ్గా.. మూడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. ఇక బీజేపీ మిత్రపక్షం ఏజేఎస్‭యూ ఒక స్థానం గెలిచేలా కనిపిస్తోంది. మిగతా మూడు స్థానాల్లో ఇండియా కూటమి పార్టీలు ముందంజలో ఉన్నాయి.

Sanatana Dharma Row : ఉదయనిధి స్టాలిన్ తల తీసుకొచ్చి ఇవ్వాలని అనటం సనాతన ధర్మమా..? : సీపీఐ కార్యదర్శి శ్రీనివాసరావు

త్రిపురలోని బోక్సానగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హొస్సేన్ విజయం సాధించారు. అలాగే ధాంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ అభ్యర్థి బిందు దేబ్ నాథ్ విజయం సాధించారు. ఏడు స్థానాలకు లెక్కింపు జరుగుతుండగా.. ఈ రెండు స్థానాల తుది ఫలితాలు మాత్రమే వచ్చాయి. అలాగే జార్ఖండ్ లోని దుమ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మిత్రపక్షం ఏజేఎస్‭యూ అభ్యర్థి యశోదా దేవీ ఆధిపత్యం సాగిస్తున్నారు.

Omar Abdullah : కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలి.. ఒమర్ అబ్ధుల్లా సవాల్

అలాగే కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం ఊమెన్ చాందీ తనయుడు చాందీ ఊమెన్ ముందంజలో ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ముందంజలో ఉన్నారు. బెంగాల్ లో టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్రంలోని ధుప్గురి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి నిర్మల చంద్ర రాయ్ ఆధిక్యంలో ఉన్నారు.