Sanatana Dharma Row : ఉదయనిధి స్టాలిన్ తల తీసుకొచ్చి ఇవ్వాలని అనటం సనాతన ధర్మమా..? : సీపీఐ కార్యదర్శి శ్రీనివాసరావు

స్త్రీలను అణిచివేయడం సనాతన ధర్మమా..? అసలు సనాతనధర్మం అంటే ఏమిటో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ కార్యదర్శి పురంధేశ్వరి ఎన్టీఆర్ వారసురాలా? ఆర్ఎస్ఎస్ వారసురాలా? అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు అప్పజెప్పడం సనాతన ధర్మమా..? అని ప్రశ్నించారు.

Sanatana Dharma Row : ఉదయనిధి స్టాలిన్ తల తీసుకొచ్చి ఇవ్వాలని అనటం సనాతన ధర్మమా..? : సీపీఐ కార్యదర్శి శ్రీనివాసరావు

AP CPM Secretary Srinivasa Rao

Sanatana Dharma Row AP CPM : తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ (udhayanidhi stalin) సనాతన ధర్మం గురించి చేసి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తున్నాయి. బీజేపీ నేతలు, స్వాములు, హిందూ సంఘాలు ఉదయనిధిపై విరుచుపడుతున్నాయి. ఈ విషయంపై చర్చలు హోరెత్తుతున్నాయి. కొంతమంది ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతుంటే బీజేపీ,హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నాయి. ఏకంగా ఓ స్వామిజీ అయితే ఏకంగా ఉదయనిధి తల నరికితే రూ.100కోట్లు ఇస్తామంటూ ప్రకటించారు. సనాతన ధర్మం వ్యాఖ్యలపై దేశమంతా అట్టుడికిపోతోంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటీ అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు (AP CPM Secretary Srinivasa Rao)స్పందిస్తు.. ఉదయనిధి స్టాలిన్ తల తీసుకొచ్చి ఇస్తే దాన్ని సనాతన ధర్మం అంటారా..?స్త్రీలను అణిచివేయడం సనాతన ధర్మమా..? అని ప్రశ్నించారు.  అసలు సనాతనధర్మం అంటే ఏమిటో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ కార్యదర్శి పురంధేశ్వరి ఎన్టీఆర్ వారసురాలా? ఆర్ఎస్ఎస్ వారసురాలా? అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు అప్పజెప్పడం సనాతన ధర్మమా..? అని ప్రశ్నించారు.రాష్ట్ర విభజనకు కారణమైన వారు ఇప్పుడు సనాతనధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మం గురించి సరిగానే చెప్పాడు.. ఉదయనిధికి సపోర్ట్ చేసిన కట్టప్ప

మనమందరం మంచికి వారసులమైతే బీజేపీ మాత్రం చెడుకు వారసులు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రధాన ప్రమాదం బీజేపీయే అంటూ విమర్శించారు. రాబోయే ఎన్నికలలో స్వతంత్ర పునాది వేసుకోవడానికి మా పార్టీ ప్రాధాన్య ఉంటుందని తెలిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు మా సహకారం ఉంటుందన్నారు. దీని కోసం సంప్రదింపులు చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 21 నుంచీ శ్రీకాకుళం, పార్వతీపురం, కర్నూలు జిల్లాల నుంచీ జాతాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే నవంబర్ 7 భారీ బహిరంగ సభ విజయవాడలో నిర్వహిస్తామని నవంబరు 7,8 లలో అసమానతలు లేని అభివృద్ధి అనే అంశంపై సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రం కరువులో ఉందని డ్యామ్ లు రిజర్వాయర్లు నీరు లేక ఎండిపోతున్నాయని అన్నారు. వరిమిశలపూడి రిజర్వాయర్ పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని..వారి రుణాలు రద్దు చేయకుండా వ్యవసాయాన్ని సంక్షోభంలో పడేసారు అంటూ విమర్శించారు. రిజిష్ట్రేషన్ విధానం కార్పొరేట్ కంపెనీల కోసం తెచ్చినట్లే ఉంది అంటూ విమర్శించారు. ఈ విధానం వల్ల సామాన్యులకు ఎటువంటి ఉపయోగంలేదన్నారు. ఆలస్యమైనా రిజిస్ట్రేషన్ విధానం సరిగా తీసుకురావాలని దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై విరుచుకుపడ్డ సీఎం యోగి.. పరాన్నజీవులంటూ విమర్శలు

స్కూళ్ళను సింగిల్ టీచర్ గా మార్చేస్తున్నారని విమర్శించారు.ఖాళీగా ఉన్న 56వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని..గిరిజన ప్రాంతాలలో స్పెషల్ డీఎస్సీ పెట్టి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతు..జమిలీ ఎన్నికలు ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. ఫెడరల్ వ్యవస్ధలో మూడు రంగాలకూ ఎన్నికలు జరగాలని..అస్ధిర రాజకీయాలకు ఎన్నికల విధానంలో లోపం కాదని అన్నారు. ఏపీలో మూడు నుంచి నాలుగు లోక్ సభ స్ధానాలు, 15 అసెంబ్లీ స్ధానాలలో పోటీ చేస్తాం మని తెలిపారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.

CM MK Stalin : కుమారుడు ఉదయనిధి ‘సనాతన’వ్యాఖ్యలపై నోరు విప్పిన సీఎం స్టాలిన్ .. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ప్రధానికి కౌంటర్