భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 40వ వ్యవస్థాపక దినోత్సవంని పురస్కరించుకుని సోమవారం(06 ఏప్రిల్ 2020) నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్టీ నిర్మాణంలో, అభివృద్దిలో విశేష కృషి చేసినవారిని గుర్తు చేసుకున్న మోడీ.. బీజేపీ అధికారంలోకి రాగానే సుపరిపాలన, పేదల సంక్షేమం పైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని వెల్లడించారు.
పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా బీజేపీ కార్యకర్తలు చాలా కృషి చేసి అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపారని, సమాజ సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ. వారి కృషి కారణంగానే దేశవ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు. (లాక్ డౌన్ దెబ్బ.. ఉద్యోగాలు ఊడినట్లేనా )
ఇదే సమయంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా.. కొవిడ్-19తో పోరాడుతున్నారని, భారత్ కూడా పోరాడుతున్న ఈ సమయంలోప్రతిఒక్కరు సామాజిక దూరం పాటించాలని, ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. భారత్ నుండి కరోనాను తరిమికొట్టాలంటూ మోడీ పిలుపునిచ్చారు.