బెంగాల్ లో టెన్షన్…బీజేపీ అభ్యర్థిపై తృణముల్ కార్యకర్తల దాడి

వెస్ట్ బెంగాల్ లోని  ఘటాల్‌ లోక్‌ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్‌ పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు. ఆమె మరో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో భారతి కంటతడి పెట్టారు.

భారతీ కారును కొందరు ధ్వంసం చేశారు.టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.మరో వైపు పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌ తో ప్రవేశించి వీడియో తీశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆమెను వివరణ కోరింది.అంతకుముందు బంకురాలోని పోలింగ్ బూత్ నెంబర్ 254 దగ్గర బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకుంది.తృణముల్ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది.ఆరోవిడత పోలింగ్‌ సందర్భంగా వెస్ట్ బంగాల్‌ లోని 8 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.