Sivakasi : న్యూ ఇయర్ వేళ విషాదం.. శివకాశిలో పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడు, శివకాశిలో పటాకుల తయారీ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.

Sivakasi : తమిళనాడు, శివకాశిలో పటాకుల తయారీ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. శనివారం ఉదయం 9.15 నిమిషాల సమయంలో పటాకులు కంపెనీలో పేలుడు జరగడంతో చుట్టుపక్కలవారు పరుగులు తీశారు. శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

చదవండి :  Sivakasi : బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..ఇద్దరు మృతి

పేలుడు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 20 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. నాలుగో మృతదేహం కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఇక ప్రమాద తీవ్రతకు ఫ్యాక్టరీలోని ఐదు షెడ్లు స్టోర్ రూమ్‌లోని ప్రధాన భాగాలు దెబ్బతిన్నాయి. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ అల్యూమినియం పౌడర్ ఉండటంతో పొగ దట్టంగా వ్యాపించింది.

చదవండి : Blast Inside Ludhiana Court : లుథియానా కోర్టులో పేలుడు..ఇద్దరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు

దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చదవండి : Tesla Car Blast With Dynamite : టెస్లా కంపెనీపై కోపం..కోటికి పైగా విలువచేసే కారును పేల్చేసిన యజమాని

శివకాశిని భారతదేశ బాణసంచా రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా అనేక సార్లు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు పెద్ద సంఖ్యలో కూలీలు మృతి చెందారు. ఈ నగరంలో తరచుగా పేలుళ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు