Sivakasi : బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..ఇద్దరు మృతి

మిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. విరుధునగర్‌ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్వపట్టులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Sivakasi : బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..ఇద్దరు మృతి

Fire In Firecracker Manufacturing Factory

Updated On : June 21, 2021 / 11:44 AM IST

Fire In firecracker manufacturing factory : తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. విరుధునగర్‌ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్వపట్టులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. అక్రమంగా పటాకులు తయారు చేస్తున్న ఓ కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి భవనం పైకప్పు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..అగ్నిమాపక సిబ్బందితో సహా.. సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీస్తున్నారు. ప్రమాదం జరిగిన ఈ కర్మాగారానికి ఎటువంటి అనుతులు లేకుండానే బాణసంచా తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో తరచూ పటాకుల తయారీ కంపెనీల్లో పలుమార్లు పలు ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తు ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండానే బాణసంచా తయారు చేస్తుంటారు చాలామంది. ఈక్రమంలో జరిగిన ప్రమాదాల్లు ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.