కరోనా భయంతో నాలుగు గోడల మధ్య ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. ఒంటరిగా ఉంటున్న 53 ఏళ్ల అంధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు ఆకతాయిలు. వృత్తి రీత్యా రాజస్థాన్ లో భర్త ఇరుక్కుపోయాడు. బ్యాంకు ఉద్యోగి అయిన మహిళ భోఫాల్ లోని షాపూరా ప్రాంతంలో ఒంటరిగా ఉంటుంది.
బాల్కనీ డోర్ తెరిచి ఉండటంతో దుండగుడు దొంగతనంగా ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను అత్యాచారం జరిపి మహిళ ఫోన్ ను పట్టుకుపోయాడు. పైగా గది తలుపు బయట నుంచి గడియపెట్టి వెళ్లిపోయాడు. మహిళ అరుపులు విని పొరుగువారు తలుపు తీశారు. ఘటన గురించి బాధితురాలు వారికి తెలియజేయడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఇంట్లో గాలి బయటకు పోవాలనే ఉద్దేశ్యంతో బాల్కనీ డోర్ తెరిచి ఉంచానని బాధితురాలు చెప్పింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీకి ఆనుకుని మెట్లు ఉన్నాయని ఏఎస్పీ సంజయ్ సాహు చెప్పారు. దుండగుడు అదే దారిలో వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేప్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.
ఘటన గురించి తెలిసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద అనుమతితో బాధితురాలి భర్త.. రాజస్థాన్ నుంచి భోపాల్ చేరుకున్నారు.
Also Read | వలస కార్మికుని ఆత్మహత్య.. రూ.2,500కి ఫోన్ అమ్మేసి, కుటుంబానికి తిండిపెట్టి… కన్నీరు పెట్టిస్తున్న కూలీ కథ