Blood moon
Blood Moon: చంద్రుడిని సాధారణ సమయాల్లో చూస్తేనే చాలా అద్భుతంగా కనపడతాడు. అటువంటి చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తే ఎలా ఉంటుంది?
చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ఈ విశేష దృశ్యాన్ని బ్లడ్ మూన్ అంటారు. 2025 సెప్టెంబర్ 7-8 రాత్రి సమయంలో బ్లడ్ మూన్ కనపడనుంది.
చూసేవారిని మంత్ర ముగ్ధులను చేసే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్లడ్ మూన్ అంటే చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించడం.
Also Read: Arjun Tendulkar Engagement: వామ్మో.. అర్జున్ టెండూల్కర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే? సచిన్ కొడుకా మజాకా..
ఈ ఏడాది ఇది రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది హార్వెస్ట్ మూన్‌తో వస్తుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే (పెరిజీ) సమయంలోనే బ్లడ్ మూన్ కనిపిస్తుంది. అందువల్ల చంద్రుడు సాధారణం కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. (Blood Moon)
పెరిజీ (Perigee) అంటే చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే స్థానం.
సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యకాంతి చంద్రుడికి చేరదు. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా వెళ్లే సూర్యకాంతి చంద్రుడిని ఎరుపు, నారింజ వర్ణంలో కప్పేస్తుంది.
NASA తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
చంద్రగ్రహణ సమయం: 15.28 – 20.55 (UTC)
సంపూర్ణ గ్రహణం: 17.30 – 18.52 (82 నిమిషాలు)
భారతదేశంలో: రాత్రి 11.00 – 12:22 (IST)
సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడాలంటే గంట 15 నిమిషాల ముందే చూడటం ప్రారంభించాలి. చైనా, థాయ్‌లాండ్, జపాన్, ఇరాన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
బైనాక్యులకర్స్ లేకుండా, ప్రత్యేక పరికరాలు లేకుండా కూడా ఆకాశంలో దీన్ని చూడవచ్చు.