Bloomberg Billionaires 2021 : అదానీ ఆదాయం రూ.5,60,000 కోట్లు.. అంబానీని అధిగమించిన అజీమ్ ప్రేమ్‌జీ

బ్లూమ్‌బర్గ్‌.. బిలియనీర్‌ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ సంపద ఏడాది 2021లో 41.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి

Bloomberg Billionaires 2021 : బ్లూమ్‌బర్గ్‌.. బిలియనీర్‌ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ సంపద ఏడాది 2021లో 41.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి 75.3 బిలియన్‌ డాలర్లకు (రూ.5,60,000 కోట్లు) చేరింది. ఇక దేశంలోనే అత్యంత శ్రీమంతుడైన ముకేశ్‌ అంబానీ కంటే విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీయే 2021లో ఎక్కువ సంపదను పెంచుకున్నారు.

Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

అజీమ్‌ ప్రేమ్‌జీ సంపద 15.8 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,18,000 కోట్లు) పెరగ్గా, ముకేశ్‌ సంపద విలువ 13 బి.డాలర్లు (రూ.97,500 కోట్లు) పెరిగిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ తెలిపింది. మొత్తంగా చూసుకుంటే ముకేశ్‌ సంపద రూ.6,70,000 కోట్లు, ప్రేమ్‌జీ సంపద రూ.3,04,000 కోట్లుగా నమోదైంది. కాగా, బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 మంది శ్రీమంతుల్లో భారతీయులెవరూ లేరు.

ట్రెండింగ్ వార్తలు