Bmw C 400 Gt
BMW C 400 GT : దేశీయ మార్కెట్ లోకి అత్యంత ఖరీదైన, పవర్ ఫుల్ స్కూటర్ రానుంది. అదే ”బీఎండబ్ల్యూ సీ 400 జీటీ”. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ, లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ ఈ నెల 12న ఈ స్కూటర్ ను విడుదల చేయనుంది. వాహన రంగంలో బీఎండబ్ల్యూ దూసుకుపోతోంది. ఇందులో కారైనా.. బైకైనా.. తనదైన ప్రత్యేకతలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. BMW C 400 GT స్కూటర్ పేరుతో మరో వండర్ ను తెస్తోంది. అక్టోబర్ 12 దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ ‘బీఎండబ్ల్యూ సీ 400 జీటీ’ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది.
Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..
బీఎండబ్ల్యూ సీ 400 జీటీ ఫీచర్స్
* సీ 400 జీటీ 350సీసీ
* సింగిల్ సిలిండర్
* లిక్విడ్ కూలెడ్ ఇంజిన్
* సీవీటీ ట్రాన్స్‌మెషిన్
* 33.5బీహెచ్‌పీ పవర్
* 35ఎన్‌ఎం టారిక్
* యాంగులర్ బాడీ ప్యానెల్స్
* పొడవైన విండ్‌స్క్రీన్
* పుల్-బ్యాక్ హ్యాండిల్ బార్,
* స్టెప్డ్ సీట్
* డ్యూయల్ ఫుట్‌రెస్ట్ ప్రొవిజన్
* ఎల్‌ఈడీ లైటింగ్
* కీలెస్ ఇగ్నిషన్
* హీటెడ్ గ్రిప్స్
* హీటెడ్ సీట్
* ఏబీఎస్
* యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్
* బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అట్రాక్టివ్ ఫీచర్లు
Lexus ES 300h : భారత్‌లో లెక్సస్ లగ్జరీ కారు విడుదల.. ధర ఏంటంటే?
ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ సీ400 జీటీ బ్లూమ్యాక్సీ ఎక్స్ షోరూం ధర రూ.5లక్షలు. రూ.లక్ష చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవాలి. ఇండియాలో అత్యంత ఖరీదైన స్కూటర్ అనే పబ్లిసిటీతో ఇది భారతీయుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే 100 బుకింగ్‌లు నమోదైనట్లు తెలుస్తోంది.