Lexus ES 300h : భారత్‌లో లెక్సస్ లగ్జరీ కారు విడుదల.. ధర ఏంటంటే?

ప్రముఖ కార్ల కంపెనీ టయోటా విలాస కార్ల విభాగమైన లెక్సస్ నుంచి ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ లెక్సస్‌ ఈఎస్‌ 300హెచ్‌ తాజాగా లాంచ్ అయింది. ఇక దీనిని తాజాగా భారత విపణిలోకి విడుదల చేసింది.

Lexus ES 300h : భారత్‌లో లెక్సస్ లగ్జరీ కారు విడుదల.. ధర ఏంటంటే?

Lexus Es 300h

Updated On : October 9, 2021 / 5:48 PM IST

Lexus ES 300h :  ప్రముఖ కార్ల కంపెనీ టయోటా విలాస కార్ల విభాగమైన లెక్సస్ నుంచి ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ లెక్సస్‌ ఈఎస్‌ 300హెచ్‌ తాజాగా లాంచ్ అయింది. ఇక దీనిని తాజాగా భారత విపణిలోకి విడుదల చేసింది టయోటా. ఇక ఈ కార్లను భారత్ లోనే తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. దీని ధరల విషయానికి వస్తే ప్రారంభ వేరియంట్ ధర రూ.56.65 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ)కాగా, లగ్జరీ వేరియంట్‌ రూ.61.85 లక్షలుగా ఉంది.

Read More : Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?

ప్రపంచ వ్యాప్తంగా 80కిపైగా దేశాల్లో ఇప్పటి వరకు 26.5 లక్షల కార్లను విక్రయించారు. అంతర్జాతీయంగా లెక్సస్‌ను 1989లో ప్రవేశపెట్టగా.. 2017 భారత మార్కెట్లో అమ్మకాలు చేపట్టింది. కొత్త ఈఎస్‌ 300 హెచ్‌ బ్యాటరీ 8 ఏళ్ల వారెంటీతో లభిస్తుందని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ కార్లకు భారత్ లో మంచి డిమాండ్ ఉందని, భారత రోడ్లకు తగిన విధంగా వీటిని తయారు చేశామని తెలిపారు.

Read More : Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!