×
Ad

Rajkot Police : కానిస్టేబుల్‌ను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..ఎందుకో తెలుసా

ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఓ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. అతను చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. అతను చేసిన ట్వీట్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు.

Anand

Bolero Is A Powerful : ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఓ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. అతను చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. అతను చేసిన ట్వీట్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. కానిస్టేబుల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలు కానిస్టేబుల్ ఏం చేశారు ? ఆ వీడియోలో ఏముంది ?

Read More : Girl Raped : బస్సులో బాలికపై అత్యాచారం.. యూపీలో దారుణం

గుజరాత్ రాష్ట్రంలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలో రాజ్ కోట్ సిటీలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు నడుం లోతులో నీళ్లు చేరాయి. రోడ్డు కనిపించకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. ఈ తరుణంలో…గుజరాత్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. రాజ్ కోట్ సిటీ మీదుగా పోవాల్సి ఉంది.

Read More : Audi E tron GT: ఇండియన్ మార్కెట్‌లో ‘ఆడి’ ఎలక్ట్రిక్ కార్లు.. ధర ఎంతో తెలుసా?

బోలేరో వాహనాన్ని ఓ కానిస్టేబుల్ నడుపుతున్నాడు. ఆ నీటిలో ఏ మాత్రం భయం లేకుండా…వాహనాన్ని పోనిచ్చాడు. అక్కడనే ఉన్న కొందరు దీనిని వీడియో తీశారు. బొలేరో వాహనం ఎంతో పవర్ ఫుల్..కారు కావొచ్చు…కానీ దానిని నడిపించాలంటే…ఓ పవర్ ఫుల్ డ్రైవర్ కావాలి..అంటూ..ఉంది..ఈ మెసేజ్ తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా మరోసారి ట్వీట్ చశారు. తమ కంపెనీ వాహనాలు ఎంతో పవర్ ఫుల్ అంటూ..ట్వీట్ లో వెల్లడించారు.