Kamaal R Khan: భారత ముస్లింలు హిందూ మతంలోకి మారాలట.. సలహా ఇచ్చిన బాలీవుడ్ సినీ క్రిటిక్

హర్యానాలోని నూహ్‫‭లో జరిగిన హింసాకాండను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ ముస్లింలు మతం మారాలని సూచించారు. నిజానికి ముస్లింలు సురక్షితంగా లేరని, కుటుంబ సభ్యులంతా ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే హిందూ మతంలోకి మారాలని ఆయన సూచించారు

Kamaal R Khan: భారత ముస్లింలు హిందూ మతంలోకి మారాలట.. సలహా ఇచ్చిన బాలీవుడ్ సినీ క్రిటిక్

Nuh Incident: కమల్ రషీద్ ఖాన్.. సినిమా సమీక్షలు, సోషల్ మీడియాలో వైరల్ కామెంట్ల ద్వారా చాలా మందికి సుపరిచితమైన పేరు. బాలీవుడ్‌లో తనను తాను విమర్శకుడిగా పిలుచుకుంటారాయన. వివాదాస్పద అంశాల్లో తరుచుగా కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇక తాజాగా హర్యానాలోని నూహ్‫‭లో జరిగిన హింసాకాండను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ ముస్లింలు మతం మారాలని సూచించారు. నిజానికి ముస్లింలు సురక్షితంగా లేరని, కుటుంబ సభ్యులంతా ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే హిందూ మతంలోకి మారాలని ఆయన సూచించారు. ఇక మరో విమర్శకుడు ఉమర్ సంధు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

Chikoti Praveen : రాజకీయాల్లోకి చీకోటి ప్రవీణ్..! బీజేపీలో చేరతారని ప్రచారం.. ఆహ్వానిస్తారా? తిరస్కరిస్తారా?

కేఆర్‭కే తన ట్వీటర్ ద్వారా స్పందిస్తూ.. “భారతదేశంలోని ముస్లింలందరూ హిందూ మతంలోకి మారాలని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మీ కుటుంబం, పిల్లల జీవితాలకు ఏ మతంతో సంబంధం లేదు. అరబ్బుల కోసం మేము ఇస్లాం మతంలోకి మారాము. కానీ ఇప్పుడు అరబ్ దేశాలు కూడా ఇస్లాంను రక్షించలేకపోతున్నాయి. అందుకే కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ మతం మారడం తప్పు కాదు’’ అని ట్వీట్ చేశారు.


ఇక, సినీ విమర్శకుడు ఉమర్ సంధు కూడా అటు ఇటుగా ఇదే వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో “భారత ముస్లింలు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లకు వెళ్లాలి. భారతదేశం ఇకపై వారికి సురక్షితం కాదు. ఇది వారికి నరకం. హిందువులు మానవత్వం నేర్చుకోవాలి” అని ట్వీట్ చేశారు.


ప్రస్తుతం, కమల్ ఆర్ ఖాన్, ఉమర్ సంధుల ఈ ట్వీట్లు చాలా వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజెన్లు వారి అభిప్రాయాల్ని విమర్శించారు. అయితే కమల్ ఆర్ ఖాన్, ఉమర్ సంధు వివాదాస్పద ట్వీట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటనలు చేశారు.