Bollywood star Salman Khan’s security tightened ( Image Source : Google )
Salman Khan Security : ఎన్సీపీ సీనియర్ నేత, బాబా సిద్ధిఖీ సిద్ధిఖీ హత్యతో బాలీవుడ్ కూడా ఉలిక్కి పడింది. బాబా సిద్ధిఖీకి అత్యంత సన్నిహితుడైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రాణహాని ఉందనే వార్తలు వస్తున్నాయి. గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరును కూడా వెల్లడించాడు. దాంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్కు భారీ భద్రతను పెంచింది. గత రెండేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు పదే పదే బెదిరింపులు వస్తున్నాయి.
రెండేళ్ల తర్వాత సల్మాన్‌కు భద్రత పెంపు :
నవంబర్ 2022లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి సల్మాన్‌కు మళ్లీ హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ భద్రతను కల్పించింది. బాబా సిద్ధిఖీ హత్య తరువాత, సల్మాన్ ముంబై పోలీసుల నిఘాలో ఉంటాడని తెలిపింది.
వై-ప్లస్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ భద్రతను పెంచింది. సల్మాన్ ఖాన్‌కు వై-ప్లస్ భద్రత (నలుగురు సాయుధ సిబ్బంది) కల్పించినట్లు సమాచారం. ఆయన కారుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ఉంటుంది. సల్మాన్‌తో పాటు శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్ కూడా వెంట ఉంటాడు.
సల్మాన్ ఖాన్‌తో సన్నిహితం కారణంగా రాజకీయవేత్త బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసి ఈ నెల 12న కాల్చి చంపింది. సల్మాన్, బాబా సిద్ధిఖీ చాలా ఏళ్లుగా సన్నిహిత స్నేహితులు. సల్మాన్‌కు సాయంగా ఉండేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించినట్లు సమాచారం.
ఈ బెదిరింపు సిద్ధిఖీ హత్యతో ముడిపడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బాబా సిద్ధిఖీ మరణానంతరం.. సల్మాన్ నివాసం, బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ల చుట్టూ కూడా భద్రతను పెంచారు. సల్మాన్ ఇంటి వెలుపల భారీగా పోలీసులు మోహరించారు. ఏప్రిల్ 2024లో, సల్మాన్ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పులు జరిగాయి. దీనికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది.