బ్రహ్మకుమారీస్ చీఫ్ కన్నుమూత…ప్రధాని సంతాపం

మహిళలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనూ అతిపెద్ద ఆథ్యాత్మిక ఆర్గనైజేషన్ బ్ర‌హ్మ‌కుమారీస్ సంస్థాన్ చీఫ్ రాజ‌యోగిని దాది జంకి(104) క‌న్నుమూశారు. రెండు నెలలుగా  శ్వాసకోస సంబంధిత సమస్యలు,ఉద‌ర‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజ‌స్థాన్ మౌంట్ అబూలోని గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం(మార్చి-27,2020) వేకువ జామున 2.10 గంట‌ల స‌మ‌యంలో క‌న్నుమూసినట్లు హాస్పిటల్ డాక్ట‌ర్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

దాది జంకి ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. బ్ర‌హ్మ‌ కుమారీల చీఫ్ గా..దాది జంకి ఎంతో శ్ర‌ద్ద‌తో, బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి స‌మాజ శ్రేయ‌స్సు కోసం పాటుప‌డ్డారు. మ‌హిళా సాధికార‌త కోసం ఎంతో శ్ర‌మించారు. ఆమెను అనురిస్తోన్న ఫాలోవ‌ర్ల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. ఓం శాంతి అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. 

దాది జంకి ఆత్మ దేవుడి ఒడిలోకి వెళ్లింది. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిద్దాం. దాది జంకి త‌న జీవ‌న‌శైలితో వ్య‌క్తిగ‌త జీవితానికి అవ‌స‌ర‌మయ్యే సూచ‌న‌లందించి, ఎంతోమందికి ధైర్యాన్నిచ్చార‌ని బ్ర‌హ్మ‌కుమారీస్ స‌భ్యులు సంతాపంలో తెలిపారు. రాజస్థాన్ లోని బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్ శాంతివన్ క్యాంపస్ లో దాది జంకి అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయి.

ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ఫ్రావిన్స్ లోని హైదరాబాద్ సిటిలో జనవరి-1,1916న రాజయోగిని దాది జన్మించారు. 21ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె ఆథ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించారు. 1970ల్లో ఇండియన్ ఫిలాసపీ,రాజ్ యోగ,హ్యూమన్ వ్యాలుస్(మానవ విలువలు)ఎస్టాబ్లిష్ చేయడానికి ఆమె పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్)కు వెళ్లింది.

ప్రపంచంలోని 140దేశాల్లో ఆమె “సేవా కేంద్రాస్” ను ఏర్పాటు చేసింది. 8,000 లాంటి సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేషనర్లుగా మహిళలే ఉన్నారు. శుభ్రత విషయంలో ఆమె కృషికి గాను భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్(క్లీన్ ఇండియా మిషన్)బ్రాండ్ అంబాసిడర్ గా దాది జంకిని నియమించింది. బ్రహ్మ కుమారీస్ తో దాదాపు 20లక్షల మంది(46,000మహిళలతో కలిపి)అసోసియేట్ అయి ఉన్నారు.

Also Read | కరోనా బాధితుల ఆరోగ్యంపై ఆందోళన వద్దు : ఈటల రాజేందర్