వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌.. ఆదిపత్యం కోసమేనా? ఠాకూర్‌లపై బ్రహ్మణులు సీరియస్..

  • Published By: vamsi ,Published On : July 12, 2020 / 10:30 AM IST
వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌.. ఆదిపత్యం కోసమేనా? ఠాకూర్‌లపై బ్రహ్మణులు సీరియస్..

Updated On : July 12, 2020 / 10:44 AM IST

నాగరిక సమాజానికి వ్యతిరేకంగా అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు రక్షించిన మాఫియా సంస్కృతి ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించేలా అభివృద్ధి చెందితే.. అతనే ఒక వికాస్ దుబే.. రాజకీయ నాయకుల, పోలీసుల, అధికారుల అండ దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు.

కుల రాజకీయాలకు కేరాఫ్ అని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వికాస్ దూబేని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో రాష్ట్రంలో ఉలిక్కిపడింది బ్రాహ్మణులు. ఇది బ్రాహ్మణ హత్య అంటూ ఇప్పుడు ఒక వాదం గట్టిగా వినిపిస్తుంది. పోలీసులు హతమార్చింది గ్యాంగస్టర్ వికాస్‌ని కాదు.. బ్రాహ్మణ సింహాన్ని, బ్రాహ్మణ పులిని అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇది బ్రాహ్మణుల ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బ్రాహ్మణలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శపణార్థాలు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ యుద్ధం మొదలయింది. గద్దెమీద ఉన్న ఠాకూర్ గ్యాంగ్ స్టర్(ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ యోగి)ని కాపాడేందుకు బ్రాహ్మణ గ్యాంగ్ స్టర్‌ని చంపేశారని ట్విట్టర్‌లో కొందరు బ్రహ్మణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచి కూడా అక్కడ ఠాకూర్లకు, బ్రాహ్మణులకు గొడవే. అసలు ఠాకూర్‌ సామాజికవర్గం అయిన యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టినప్పుడే చాలా మంది బ్రాహ్మణులు ముఖం మాడ్చేశారు. ఇప్పుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌తో బ్రాహ్మణ సామాజికవర్గం యోగిపై ఫైర్ అయిపోతుంది. ఎన్‌కౌంటర్‌ చేసింది వికాస్‌దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను కాదని, బ్రాహ్మణ గౌరవ ప్రతిష్టలను అని సోషల్‌ మీడియాలో యూపీ బ్రాహ్మణ వర్గాలు అంటున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో వికాస్ దూబేని చంపడంతో బ్రాహ్మణులను అణగదొక్కేందుకు ఠాకూర్ వర్గం కుట్ర చేస్తున్నదని బ్రహ్మణులు ఆరోపిస్తున్నారు. బ్రాహ్మణులు ఐక్యం కావాలని పిలుపిస్తూ.. బ్రాహ్మణులు బతికితే వికాస్ దూబేలాగా బతకాలి అని ఆయన అమరుడిగా కీర్తిస్తున్నారు. తుపాకి పట్టండంటున్నారు. బ్రాహ్మణులంతా తామువిష్ణు దేవుడి ఆరో అవతారం పరశురాముడి వారసులమనే విషయం మర్చిపోరాదని, పోరాడటం నేర్చుకోవాలంటూ అంటున్నారు. వికాస్ దూబే బ్రాహ్మిణుడుకాకపోతే, చంపే వాళ్లే కాదని, బ్రాహ్మణుయినందుకే ఆయనను చంపారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని వ్యతిరేక స్లోగన్లు కనిపించాయి. ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ లేదా ట్విట్టర్‌లో అయినా, శుక్రవారం ఉదయం వికాస్ దుబే ఎన్‌కౌంటర్ హత్య జరిగినప్పటి నుండి ఇలాంటి పోస్టులు మరియు వీడియోలతో నిండిపోయింది

‘మీరు చంపింది కేవలం వికాస్ దూబేని కాదు, మీరు చంపింది బ్రాహ్మణ విశ్వాసాన్ని. మీరు మా విశ్వాసాన్ని ఖూనీ చేశారు. మా వికాసాన్ని ఖూనీ చేశారు. దేశంలోని మిశ్రా, పాండేలు, చౌబేలు,తివారీలు, భూమిహారుల్లారా! పరశురాముడెవరి తలపడ్డాడో బ్రాహ్మణులంతా గుర్తుంచుకోవాలి,’ అని శివమ్ బ్రాహ్మిణ్ దాదాబాయ్ అనే వ్యక్తి ఫేస్ బుక్‌లో ఘీంకరించాడు. ఇలాంటి వ్యక్తి మీద మీరు సినిమా తీయాలనుకుంటున్నారా, ధియేటర్లను కాల్చేస్తామని హెచ్చరించాడు.

(ఈ పోస్టును ఫేస్ బుక్ ఇపుడు తొలగించింది.)

ఠాకూర్ల మీదకు కత్తులు దూస్తున్న బ్రాహ్మణులు:
వికాస్ దూబేని కాల్చిచంపగానే నార్త్ లో ముఖ్యంగా యూపిలో బ్రాహ్మణ ఆత్మాభిమానం దెబ్బదతీశారని, వికాస్‌ దూబేను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టి బ్రాహ్మణులపై తమకున్న కసిని కోపాన్ని ఠాకూర్లు మరోసారి ప్రదర్శించారని ఆరోపిస్తున్నారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కొందరు. చంపింది వికాస్‌ దూబేను కాదని, బ్రాహ్మణుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని అని యోగి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు.

దూబే ఎన్‌కౌంటర్‌తో సెంటిమెంట్‌ మారిపోయింది.. ఆగ్రహం ముస్లింల నుంచి యోగివైపుకు మళ్లింది.. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని ఇప్పటి నుంచే తీర్మానాలు చేస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. ఠాకూర్లు-బ్రాహ్మణుల మధ్య జరిగే ఆధిపత్య పోరాటంలో ఎప్పుడూ బలిపశువులవుతున్నది తమ వర్గమేనని బ్రాహ్మణులు చెబుతున్నారు. తాము పట్టుపడితే ఎలా ఉంటుందో అన్నదానికి 2018లో గోరక్‌పూర్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికనే నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.

నిజానికి బీజేపీని బ్రాహ్మిణ్‌, బనియా పార్టీగా చెప్పుకునేవారు.. ఇప్పుడు తమను బీజేపీ సైడ్‌లైన్‌ చేసిందని బ్రాహ్మణులు భావిస్తున్నారు. ఇది తెలియనంత అజ్ఞానులేం కాదు బ్రాహ్మణులు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వికాస్‌దూబే కారణంగా చనిపోయిన పోలీసులలో బ్రాహ్మణులు ఉన్నారు.. అలాగే వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారుల్లోనూ బ్రాహ్మణులు ఉన్నారు.. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ జరిగిన చౌబేపూర్‌ కూడా బ్రాహ్మణుల ఆధిపత్యమున్న ప్రాంతమే. అయితే ఠాకూర్‌లు బ్రహ్మణుల మధ్య చెలరేగిన మంటలు ఓ గ్యాంగ్‌స్టర్ కోసం కావడం. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలవారిని విస్మయానికి గురి చేస్తుంది.