Breaking News : భారత్ లో కరోనా..మరో ఇద్దరు మృతి

  • Publish Date - March 26, 2020 / 05:57 AM IST

భారత్ పై కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు పలువురు మృతి చెందుతున్నారు. తాజాగా దేశంలో ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు చనిపోయారు. కరోనా వైరస్ సోకి జమ్మూ కాశ్మీర్ లో ఒకరు, మహారాష్ట్ర లో ఒకరు మృతి చెందారు. 

మహారాష్ట్రలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య నాలుగుకి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ లో తొలి మరణంగా చెప్పవచ్చు. ఈ మరణాలతో దేశ వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 14కి చేరుకుంది. 664 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. 

దేశంలో ప్రబలుతున్న ఈ వైరస్ ని అరికట్టడానికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకొంటోంది. ప్రజలు రోడ్ల మీదకు తిరగవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. అందులో భాగంగా జనతా కర్ఫ్యూని విధించారు. అంతేగాకుండా..ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ ఎన్ని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా..కేసుల సంఖ్య తక్కువ కావడం లేదు…మరణాలు కూడా సంభవిస్తుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా మరో ఇద్దరు చనిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ వేల మందిని బలి తీసుకుంది. భారతదేశంలో వైరస్ మరింత విస్తరించకుండా..మరణాలు సంభవించకుండా..చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Also Read | కూలీలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయండి : రాహుల్ డిమాండ్