బ్రేకింగ్ :పాక్ బాంబులేసింది ఇక్కడే

జమ్మూ కాశ్మీర్ : మంగళవారం తెల్లవారు ఝూమున భారత వాయుసేన పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయటంతో అసహనంతో ఉన్న పాకిస్తాన్ సైన్యం బుధవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగన తలంలోకి బుధవారం రెండు పాకిస్తాన్ యుధ్ద విమానాలు రాజౌరి సెక్టార్ లోకి ప్రవేశించి భద్రతా దళాల సమీపంలో బాంబు వేసాయి. పాక్ విమానాలను గమనించిన భారత వైమానిక దళం వాటిని తిప్పి కొట్టింది. భారత్ లో ప్రవేశించిన రెండు జెట్ ఫైటర్లలో ఒకదానిని భారతసైన్యం కూల్చివేసినట్లు అధికారులు చెపుతున్నారు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి
భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడిన నేపథ్యంలో లీ, జమ్మూ, శ్రీనగర్, పఠాన్‌కోట్ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఆయా గగనతలాల పరిధిలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకుల విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. పలు కమర్షియల్ విమానాల సర్వీసులను కూడా పెండింగ్‌లో ఉంచారు. మరోవైపు ఉడీ, పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పలువురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి.
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు