బాయ్ ఫ్రెండుతో వెళ్లిపోయిన అక్క..చెల్లి మెడలో తాళికట్టిన వరుడు

బాయ్ ఫ్రెండుతో వెళ్లిపోయిన అక్క..చెల్లి మెడలో తాళికట్టిన వరుడు

Updated On : February 19, 2021 / 10:57 AM IST

Groom Marries Minor Sister : కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువుల సందడితో మంటపం కోలాహాలంగా ఉంది. అంతలోనే..అలజడి. పెళ్లి కూతురు కనిపించడం లేదని, అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. దీంతో పెళ్లి కూతురు చెల్లెలను పెళ్లి కూతురును చేయించారు. చివరిలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే..ఆమె మైనర్ కాబట్టి. ఈ ఘటన ఒడిషాలోని కలహండి ప్రాంతంలో జరిగింది. జైపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని Malpada గ్రామంలో నివాసం ఉంటున్న కుటుంబంలోని యువతికి వివాహం నిశ్చయమైంది.

ముహూర్తం ఫిక్స్ చేశారు. కాసేపట్లో పెళ్లి అవుతుందని అనగా…వధువు తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది. వధువు పారిపోవడంతో వరుడు షాక్ తిన్నాడు. ఆమెకు చెల్లెలైన 15 ఏళ్ల వయస్సున్న మైనర్ బాలికకు నచ్చచెప్పి…వరుడికిచ్చి పెళ్లి చేయించారు. ఆమె మెడలో తాళి కట్టేశాడు. ఈ సమాచారం పోలీసులకు తెలిసింది. ఛైల్డ్ ఫ్రొటెక్షన్ ఫోర్స్ తో అక్కడకు చేరుకున్నారు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమౌతున్న బాలికను రక్షించి..సోదరుడికి అప్పగించినట్లు Kalahandi district child protection officer Sukanti Behera వెల్లడించారు.

18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ బాలిక కాపురానికి వెళుతుందని, అప్పటివరకు తన చదువును పూర్తి చేయాలనుకుంటే ఆమె ఇంట్లో లేదా హాస్టల్‌లో ఉండవచ్చని పోలీసులు నిర్ణయించారు. రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేయడం చట్ట విరుద్ధమనే సంగతి అటు వధువు, ఇటు వరుడి కుటుంబాలకు తెలియదని అధికారి తెలిపారు.