Uttar Pradesh : తాళి కట్టే టైంలో కట్నం డిమాండ్ చేశాడని వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబ సభ్యులు

మూడు ముళ్లు వేయాల్సిన పెళ్లికొడుకు వేదికపై వరకట్నం డిమాండ్ చేశాడు. పెళ్లికూతురి తరపువారు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కలగజేసుకున్న ఈ ఘటనలో పెళ్లి జరిగిందా? లేదా?

Uttar Pradesh

Uttar Pradesh : వేదికపై వధూవరులు దండలు మార్చుకునే సమయంలో వరుడు కట్నం డిమాండ్ చేశాడు. లేదంటే పెళ్లి ససేమిరా అన్నాడు. కోపోద్రిక్తులైన వధువు కుటుంబ సభ్యులు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Farmer Hires Helicopter: కుమారుడి పెళ్లి కోసం హెలికాప్టర్ అద్దెకు తీసుకున్న రైతు

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో పెళ్లి దండలు మార్చుకునే సమయంలో వరుడు అమర్జీత్ వర్మ వరకట్నం డిమాండ్ చేశాడు. వధువు కుటుంబం ఈ డిమాండ్ తో అవాక్కయ్యారు. కట్నం ఇవ్వకపోతే పెళ్లి ససేమిరా అన్న వరుడిని చెట్టుకు కట్టేశారు. చెట్టుకు కట్టేస్తున్నా వరుడు మాత్రం మౌనంగా చూస్తూ ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక పోలీసులు ఎంట్రీ ఇచ్చి వరుడిని విడిపించి అదుపులోకి తీసుకున్నారు. మాంధాత పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. రాజీ మాత్రం కుదరలేదు.

Viral Video: పెళ్లి కూతురును ఎత్తుకునేందుకు ప్రయత్నించిన పెళ్లి కొడుకు.. ఇద్దరూ ఎలా పడ్డారో చూడండి

వరుడి స్నేహితులు వధువు బంధువులతో దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. వివాహ ఏర్పాట్ల సమయంలో జరిగిన ఖర్చులతో పాటు వధువు పక్షానికి పరిహారం అందించేందుకు రెండు కుటుంబాల మధ్య చర్చ జరిగిందట. ఇలా మొత్తానికి పెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో @Sisodia19Rahul ట్విట్టర్ యూజర్ షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.