Chennai Rains : వానలో పెళ్లి.. బోటులో వధూవరులను తీసుకెళ్లిన రెస్క్యూ టీం

బుక్ చేసుకున్న కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో నడుంలోతు వరకు నిలిచిపోయింది. దీంతో పెళ్లి కష్టాలు మొదలయ్యాయి. అలాగే వివాహం నిర్వహించారు. కానీ..

Chennai Bride

 Bride, Groom Evacuated Via Boat : వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని మధురానుభూతిగా మలుచుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వినూత్నంగా పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని, గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరుపుకోవాలని ఎన్నో జంటలు, కుటుంబాలు ఆశిస్తాయి. ఇలాగే ఓ జంట ఆలోచించింది. కానీ వారి ఆలోచనలకు, కలలకు వర్షం బ్రేకప్ వేసింది. భారీ వర్షం సాక్షిగా ఒక్కటి కావాల్సి వచ్చింది. అనంతరం వధూవరులు, బంధువులు బోటులో వెళ్లాల్సి వచ్చింది. ఇలా జరగడం తమకు హ్యాపీగానే ఉందంటూ…నూతన జంట అంటోంది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

Read More : Reshma Kosaraju : కార్చిచ్చులను ముందే తెలిపే టెక్నాలజీ కనుగొన్న తెలుగమ్మాయికి అమెరికా ప్రతిష్ఠాత్మక పురస్కారం

ప్రభు, ముత్తులక్ష్మీలకు వివాహం కుదిరింది. వీరి పెళ్లికి ముహర్తం ఖరారు చేశారు. తేనాంపేటలో ఓ పెద్ద కళ్యాణ మండపం బుక్ చేశారు. గ్రాండ్ గా వివాహం జరుపుకోవాలని భావించారు. అయితే..చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎలా వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు ఆలోచించసాగారు. బుక్ చేసుకున్న కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో నడుంలోతు వరకు నిలిచిపోయింది. దీంతో పెళ్లి కష్టాలు మొదలయ్యాయి. అలాగే వివాహం నిర్వహించారు. కానీ..అకస్మాత్తుగా వరద భారీగా పెరిగిపోవడంతో హాల్ నుంచి బయటకు రావడం కష్టంగా మారిపోయింది.

Read More : Turkish : మాయలో పడకుండా..పెద్ద ఐస్ క్రీంతో పారిపోయాడు, వీడియో వైరల్

సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం పడవలను ఏర్పాటు చేసింది. బోటుల్లో నూతన వధూవరులు, బంధువులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మూడు కిలోమీటర్ల వరకు వారిని తీసుకెళ్లి రక్షించారు. ఈ వీడియోలు సోషల్ మీడియో వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నామని, లగ్జరీ కారు, బ్యాండు మేళా అన్నీ సమకూర్చుకున్నా..వర్షం దెబ్బతీసిందని..కానీ..పడవ ప్రయాణం తమ జీవితంలో ఎప్పుడూ నిలిచిపోతుందన్నారు వరుడు.