Wedding Venue : కాసేపట్లో పెళ్లనగా భార్య ఎంట్రీ.. వరుడి తమ్ముడిని పెళ్లాడిన వధువు

కాగా ఈ ఘటన బీహార్ లోని పాట్నా నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈ నెల 15న పెద్దలు వివాహం చేయాలనుకున్నారు. అయితే అనిల్ అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలను ఎదురించలేక మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

Wedding Venue : కాసేపట్లో పెళ్లనగా భార్య ఎంట్రీ.. వరుడి తమ్ముడిని పెళ్లాడిన వధువు

Wedding Venue

Updated On : June 18, 2021 / 5:51 PM IST

Wedding Venue : పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో వధువరులు పీఠల మీదకు వస్తారనగా ఓ యువతి పెళ్లి వేదిక వద్దకు వచ్చింది. పెళ్లి ఆపాలంటూ గట్టిగా కేకలు చేసింది. దీంతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.

అసలు ఏం జరిగిందని ఆ యువతిని వరుడి కుటుంబ సభ్యులు అడగడంతో జరిగిన విషయం చెప్పింది. ఆ యువతికి, పెళ్లి కాబోతున్న వరుడు గతంలోనే తాళికట్టాడట.. ఆ విషయం వరుడి కుటుంబ సభ్యులకు తెలియదు.. ఇక పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికూతురు వరుడి తమ్ముడుతో తాళికట్టించుకుంది.

కాగా ఈ ఘటన బీహార్ లోని పాట్నా నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈ నెల 15న పెద్దలు వివాహం చేయాలనుకున్నారు. అయితే అనిల్ అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలను ఎదురించలేక మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

మరికాసేపట్లో యువతికి తాళి కడతాడనగా అనిల్ ప్రేయసి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అందరి ముందు అనిల్ నిజం అంగీకరించి తన ప్రేయసికి క్షమాపణలు చెప్పాడు. ఇక ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసి అనిల్ తమ్ముడితో పింకీ మేడలో తాళికట్టించారు.