VIRAL Video : పెళ్లి చేసుకోను..పెళ్లి మండపమే ఎక్కను, కారణం తెలిసి..నవ్వేశారు

పెళ్లి మండపానికి వచ్చిన నూతన వధువు..పెళ్లి మండపం ఎక్కడానికి నో చెప్పింది. దీంతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. అసలు విషయం తెలుసుకున్న వారు..ఘొల్లున నవ్వారు.

VIRAL Video : పెళ్లి చేసుకోను..పెళ్లి మండపమే ఎక్కను, కారణం తెలిసి..నవ్వేశారు

Bride

Updated On : August 25, 2021 / 8:21 AM IST

Bride Refuses : ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం, పెళ్లి వేడుకలో జరుగుతున్న కొన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..ఓ పెళ్లి కూతురుకు సంబంధించని వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లి మండపానికి వచ్చిన నూతన వధువు..పెళ్లి మండపం ఎక్కడానికి నో చెప్పింది. దీంతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. అసలు విషయం తెలుసుకున్న వారు..ఘొల్లున నవ్వారు.

Read More : Navy : 302 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

ఓ ఇంట పెళ్లి జరుగుతోంది. నూతన వధువు పైన అందంగా అలంకరించిన పూలతో కూడిన వస్త్రాన్ని పట్టుకుని ముందుకు నడుస్తున్నారు కొంతమంది. అందంగా అలంకరించుకు..పెళ్లి కూతురు చిరు నవ్వులు చిందిస్తూ..ముందుకొస్తోంది. అకస్మాత్తుగా ఓ దగ్గర ఆగిపోయింది. ముందుకు వెళ్లాలని బంధువులు కోరగా..తాను వెళ్లనని చెప్పేసింది. అసలు విషయం ఏమిటనీ అడిగారు.

Read More : Taliban : తాలిబన్ కొత్త ప్రభుత్వం : కాబూల్ గవర్నర్, మేయర్‌ సహా ఏడుగురి పేర్లు ప్రకటన!

తాను ఎంట్రీ ఇస్తున్న సమయంలో..చెప్పిన పాటను ఎందుకు ప్లే చేయలేదు అని పెళ్లి కూతురు అమాయకంగా ప్రశ్నించడంతో అక్కడున్న వారు ముసిముసి నవ్వులు నవ్వారు. అక్కడున్న ఈవెంట్ ఆర్గనైజేర్స్ తో గొడవకు దిగింది. నేను పెళ్లి చేసుకోను..పెళ్లి మండపం ఎక్కను అంటూ బుంగమూతి పెట్టేసింది. చివరకు అక్కడున్న వారు.. నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఓదార్చడంతో పెళ్లి కూతురు ముసిముసి నవ్వులు నవ్వింది. దీనికి సంబంధించిన వీడియోను theweddingbrigade ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. మూడు రోజుల కిందట పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by The Wedding Brigade (@theweddingbrigade)