Viral Video : షాకింగ్ వీడియో… కుప్పకూలిన మరో బ్రిడ్జి, ముగ్గురు మృతి, తప్పించుకుందామని చూసినా…

కొన్ని నెలలుగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలడం స్థానికులను షాక్ కి గురి చేసింది. Bridge Collapse

Bridge Collapse Video(Photo : Google)

Bridge Collapse Video : గుజరాత్ లో మరో బ్రిడ్జి కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి కుప్పకూలింది. పాలన్ పూర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ట్రాక్టర్, ఆటో శిథిలాల కింద నుజ్జునుజ్జు అయ్యాయి. వాటిలో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చూస్తుండగానే ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. అదే సమయంలో గుర్తించిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరుగు తీశాడు. కానీ, ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. శిథిలాల కింద పడి చనిపోయాడు. కూలిన బ్రిడ్జి ఆ వ్యక్తి మీద పడటం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Also Read : రూ.కోటి బీఎండబ్ల్యూ కారులోంచి రూ.14 లక్షలను ఒకే ఒక్క నిమిషంలో ఎలా దొంగిలించారో చూడండి

సోమవారం(అక్టోబర్ 23) ఈ ఘటన జరిగింది. కొన్ని నెలలుగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. బనస్ కాంత ప్రాంతంలోని ఆర్టీవో సర్కిల్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలడం స్థానికులను షాక్ కి గురి చేసింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే బ్రిడ్జిలోని ఓ భాగం కుప్పకూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, గతేడాది మోర్బిలోని మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోవడంతో 132 మంది చనిపోయారు. ఇక, గత నెలలో సురేంద్ర నగర్ జిల్లాలో మరో వంతెన కూలడంతో పలువురు గాయపడ్డారు.

Also Read : ఆన్ లైన్ మోసం.. యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి రూ.73 లక్షలు పోగొట్టుకున్నారు

गुजरात के पालनपुर में ब्रिज का एक निर्माणाधीन हिस्सा हुआ धराशायी