Viral Video: రూ.కోటి బీఎండబ్ల్యూ కారులోంచి రూ.14 లక్షలను ఒకే ఒక్క నిమిషంలో ఎలా దొంగిలించారో చూడండి

ఇక్కడ హైలైట్ ఏంటంటే.. కారు అద్దాన్ని ఒక్క సెండ్ లో పగలగొట్టాడు. అందుకు అతడు ఒక ప్రత్యేక సాధాన్ని ఉపయోగించాడు. అది కెమెరాకు కనిపించనంత చిన్నగా ఉండడం విశేషం.

Viral Video: రూ.కోటి బీఎండబ్ల్యూ కారులోంచి రూ.14 లక్షలను ఒకే ఒక్క నిమిషంలో ఎలా దొంగిలించారో చూడండి

Updated On : October 23, 2023 / 3:55 PM IST

Bengaluru: దొంగతనం చేయడమంటే పక్కా ప్రణాళిక ఎంతో రిస్క్ ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నిమిషాల వ్యవధి, సెకన్ల వ్యవధిలో జరిగిపోతుంటాయి. బెంగళూరులో తాజాగా ఇలాంటి దొంగతనమే ఒకటి జరిగింది. కోటి రూపాయల బీఎండబ్ల్యూ కారులోంచి ఏకంగా 14 లక్షల రూపాయల్ని కేవలం 58 సెకండ్ల వ్యవధిలో చోరీ చేశారు. ఈ చోటీ సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. అకస్మాత్తుగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. ఓ యువకుడు బైక్ దిగి కారు చుట్టూ తిరుగుతున్నాడు. అటు ఇటు చూసి డ్రైవర్ సైడ్ విండోను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, కారులో ఉన్న బ్యాగ్‌ తీసుకుని బయటకు వచ్చాడు. దొంగతనం జరిగిన సమయంలో కొంత దూరంలో చాలా మంది నిలబడి ఉన్నారు. అయితే వాళ్లెవరూ ఇటి వైపు నిలబడి లేకపోవడం వల్ల ఎవరికీ ఇది కనిపించలేదు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే.. కారు అద్దాన్ని ఒక్క సెండ్ లో పగలగొట్టాడు. అందుకు అతడు ఒక ప్రత్యేక సాధాన్ని ఉపయోగించాడు. అది కెమెరాకు కనిపించనంత చిన్నగా ఉండడం విశేషం.


ఈ సీసీటీవీ ఫుటేజీలో అతను కారులోంచి బ్యాగ్‌తో బయటకు రావడం చూడొచ్చు. ఇక అక్కడే ఆగి ఉన్న మిత్రుడి బైక్‌ ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. చోరీకి గురైన కారు బీఎండబ్ల్యూ ఎక్స్5 అని పోలీసులు తెలిపారు. దీని ధర కోటి రూపాయల కంటే ఎక్కువ ఉంటుందట. ఫుటేజీలో దొంగలు ఇద్దరు తమను గుర్తుపట్టకుండా వారి ముఖాలకు ముసుగులు ధరించి కనిపించారు. అద్దాన్ని పగులగొట్టేందుకు దొంగ ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించాడు. అద్దాలు పగలగొట్టి కిటికీలోంచి కారులోకి ప్రవేశించాడు. ఈ సమయంలో బైక్‌పై కూర్చున్న మరో సహచరుడు అక్కడా ఇక్కడా ఉన్న వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచి, ఎవరైనా వస్తే వెంటనే సమాచారం అందించి ఇద్దరూ సకాలంలో అక్కడి నుంచి పారిపోయేందుకు సహకరించాడు.