గ్రాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తామన్నారు. పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
EPFO సభ్యుల సంఖ్య రెండేళ్లల్లో 2 కోట్లకు పెరిగిందన్నారు. కార్మికుల ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.