budget 2021 : గడిచిన 12 నెలలుగా కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి…ప్రజల ఆదాయం తగ్గింది… నిరుద్యోగం పెరిగింది..ఇక ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది…ఇలాంటి వాటికి నిర్మలమ్మ పద్దు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నందన్నది ఆసక్తిగా మారింది. కరోనాతో ఆదాయం తగ్గడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం ఎలాంటి పన్నుల భారం మోపుతుందోనన్న భయం కూడా ప్రజల్లో ఉంది.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో బడ్జెట్‌లో రైతులకు కేంద్రం ఎలాంటి భరోసా ఇస్తుంది అన్నది కూడా కీలకంగా మారింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా కొన్ని కీలక నిర్ణయాలు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ అనగానే వేతన జీవులు పన్ను మినహాయింపుల కోసం ఎదురుచూస్తారు. ఈసారి కూడా టాక్స్ బెనిఫిట్స్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సొంతింటి కోసం కలలు కనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.
తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలకు ప్రోత్సాహకాలు, ఉపాధి , ఉద్యోగ కల్పనకు పెద్ద వేస్తారా అన్నది కూడా చూడాలి. కరోనా కష్టకాలంలో వస్తున్న బడ్జెట్ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లోనే తేలనుంది.