Biden Delhi visit : ఢిల్లీలో జో బిడెన్‌ పర్యటన సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ బీస్ట్…మూడంచెల భద్రత

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు రానున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్ యూఎస్ ప్రెసిడెన్షియల్ కాడిలాక్ ది బీస్ట్ లో ప్రయాణించనున్నారు....

Bulletproof Beast

Bidens Delhi visit : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లో (G20 Summit 2023) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు రానున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్ యూఎస్ ప్రెసిడెన్షియల్ కాడిలాక్ ది బీస్ట్ లో ప్రయాణించనున్నారు. (JOE BIDEN IN INDIA) జో బిడెన్ కోసం ప్రత్యేకంగా ది బీస్ట్ (Bulletproof Beast) కారును యూఎస్ నుంచి బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్ III విమానంలో భారతదేశానికి తీసుకువచ్చారు.

PM Modi : ఇండోనేషియాలో మోదీకి ప్రవాస భారతీయుల ఘనస్వాగతం

జో బిడెన్ ఢిల్లీ పర్యటనకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. (3 layer security) బయటి పొరలో భారత పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది ఉంటారు. (Bidens Delhi visit) రెండవ లేయర్‌లో భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నకు చెందిన కమాండోలు ఉంటారు. లోపలి సర్కిల్‌లో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉంటారు. జో బిడెన్ ఇతర యూఎస్ ప్రతినిధులు ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్‌లో బస చేస్తారు. బిడెన్ రాక సందర్భంగా హోటల్ సిబ్బందిని తనిఖీలు చేశారు.

Pakistan : పాకిస్థాన్‌లో తాలిబన్ మిలిటెంట్ల దాడి, 16 మంది మృతి

జో బిడెన్ బస చేసే 14వ అంతస్తును సందర్శించే వారికి ప్రత్యేక యాక్సెస్ కార్డులు ఇచ్చారు.కిందకి చేరుకోవడానికి ప్రత్యేక లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా అధినేత కోసం ఈ హోటల్‌లో 400 గదులు బుక్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ,సురక్షితమైన కారుగా పేరొందిన ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు అన్ని సమయాల్లో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ రక్షణలో ఉంటుంది. భారత వాయుసేన, భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్లు ఢిల్లీపై కన్ను వేస్తూ నిరంతరం ఆకాశంలో తిరుగుతాయి.

Japan : జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం

ఈ హెలికాప్టర్లలో ఆర్మీ ,నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు ఉంటారు. ఢిల్లీలో చాలా చోట్ల యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఎత్తైన భవనాలపై నేషనల్ సెక్యూరిటీ గార్డులు, ఆర్మీ స్నిపర్లను మోహరించారు. ఢిల్లీ పోలీసులు వివిధ దేశాల అడ్వాన్స్ టీమ్‌లతో సమన్వయం చేస్తున్నారు.

Amit Malviya : బీజేపీ నేత అమిత్ మాల్వియాపై పోలీసు కేసు

యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కు కరోనా సోకినా, జోబిడెన్ కు జరిపిన పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది. దీంతో గురువారం జో బిడెన్ భారతదేశానికి రానున్నారు. చారిత్రాత్మక జి 20 సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 8వతేదీన బిడెన్ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే జి20 సమ్మిట్ అధికారిక సెషన్స్‌లో జో బిడెన్ పాల్గొంటారు.

ట్రెండింగ్ వార్తలు