Bulli Bai App
Bulli Bai App : నిండా 21 ఏళ్లు లేవు వాళ్లకు. మైండ్ నిండా బూతు ఆలోచనలు. స్కూళ్లు, కాలేజీల్లో నేర్పిన పాఠాలు వారి బుర్రకెక్కలేదు. అరచేతిలోకి వచ్చిన టెక్నాలజీ సాయంతో.. మహిళల గౌరవాన్ని అంగడి వస్తువుగా మార్చేస్తున్నారు. మహిళలకు రెస్పెక్ట్ ఉంటుంది.. దానిని కాపాడాలన్న మినిమం ఇంగితం లేదు వాళ్లకు. అలా చేసిన తప్పులకు ఇపుడు కటకటాలు లెక్కపెడుతున్నారు.
Read This : Samantha : ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ మేకింగ్ వీడియో బయటపెట్టిన సమంత
ఏంటి ఈ బుల్లి బాయ్ యాప్?
బుల్లి బాయ్(Bulli Bai) యాప్. ఇంటర్నెట్‌లోని శతకోటి .apk దరిద్రాల్లో ఇది కూడా ఒకటి. కొందరి వరెస్ట్ ఆలోచనలతో పుట్టిన మొబైల్ అప్లికేషన్ ఇది. 20 నుంచి 21 ఏళ్ల వయసున్న కొందరు ఓ గ్రూప్ గా ఏర్పడి ఈ యాప్ ను ప్రైవేట్ గా నడుపుతున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీకి చెందిన వాళ్లు ఈ గ్రూప్ లో ఉన్నట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
సొసైటీలో బాగా పేరున్న ఆడవాళ్లు.. సోషల్ సర్వీస్ చేస్తున్న మహిళల ఫొటోలను ఈ యాప్ లో పెట్టి వాళ్లను వేలం వేస్తున్నారు. “ఈ నైట్ కు మీతో సరదాకు ఈమె సిద్ధం”, “ఈమెతో ఫన్ కోసం కాంటాక్ట్ చేయండి” లాంటి క్యాప్షన్స్ పెడతారు. నిజంగా సదరు మహిళను వేలం వేస్తారా అన్నది కాదు పాయింట్. ఆన్ లైన్ లో ఆ మహిళల ఫొటోలను వేలం వేయడం.. డబ్బులిచ్చి కొనుక్కున్నవారికి.. మహిళలను అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను యాప్ నిర్వాహకులు పంపడం.. వారి మార్ఫింగ్ ఫొటోలతో వ్యాపారం.. ఇదీ దందా.
హైదరాబాద్ టోలిచౌకీ, రాజేంద్రనగర్‌లోనూ బాధితులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లోనూ జనవరి 4న ఓ కంప్లయింట్ వచ్చింది. సైబర్ చీటింగ్ పై పోలీసులకు బాధితులు పిర్యాదు చేశారు. మహిళా సామాజికవేత్తలను టార్గెట్ చేసి.. అసభ్యకరంగా ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని కంప్లయింట్ ఇచ్చారు. Geet Hits యాప్ ద్వారా మహిళా సామాజిక వేత్తల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. అసభ్య పదజాలంతో సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. బుల్లి బాయ్ అనే యాప్ తో తమను టార్గెట్ చేస్తున్నారని.. టోలిచౌకికి చెందిన బాధిత మహిళా సామాజిక వేత్త హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ లోనూ ఇలాంటి కేసు నమోదైంది.
Read This : Hairstylist: నీటికి బదులు ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్ చేసిన జావేద్ హబీబ్
దేశవ్యాప్తంగా సైబర్ అలర్ట్
ఇలా.. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందేసరికి నేషనల్ వైడ్ గా సైబర్ పోలీసులు అలర్టయ్యారు. బుల్లి బాయ్ వెనుక ఉన్నదెవరో తేల్చి వారిని అరెస్ట్ చేశారు.
ఇంతకీ ఎవడాడు..?
బుల్లి బాయ్ యాప్ క్రియేటర్ 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉండేది అసోంలోని దిగంబర్ జొర్హాట్. ఇతడిని అసోంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో కొన్ని డిజిటల్ డివైజ్‌లను కూడా సీజ్ చేశారు. జనవరి 6 వరకు ఓవరాల్ గా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో 18 ఏళ్ల గర్ల్ స్టూడెంట్ శ్వేతా సింగ్ ఉండటం షాకింగ్ అప్‌డేట్ గా చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్ లో 21 ఏళ్ల మయాంక్ రావల్, బెంగళూరులో 21 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ విశాల్ కుమార్ ఝాలు మిగతా నిందితులు.
Read This : Rajasthan : చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహం..పోస్టుమార్టంలో షాకింగ్ నిజాలు
ఎటువంటి శిక్షలు పడొచ్చు..?
ప్రధానంగా ముస్లిం మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా యాప్ లో అప్ లోడ్ చేసి.. వర్చువల్ గా ఆక్షన్ చేశారని పోలీసులు తేల్చారు. గతేడాది వచ్చిన ఓ యాప్ ను క్లోన్ చేసి బుల్లిబాయ్ యాప్ గా మార్చినట్టు పోలీసులు తేల్చారు. వీరందరికీ సైబర్ క్రైమ్ చట్టాలకు అనుగుణంగా శిక్షలు పడనున్నాయి.