Rajasthan : చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహం..పోస్టుమార్టంలో షాకింగ్ నిజాలు

నాకు దక్కని ఆమె ఎవ్వరికి దక్కకూడదనే ఉన్మాదంతో ఓ బాలికను అత్యంత పాశవికంగా హత్య చేశాడో యువకుడు. చంపి చెట్టుకు వేలాడదీశాడు.

Rajasthan : చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహం..పోస్టుమార్టంలో షాకింగ్ నిజాలు

Rajasthan Crime

Rajasthan Crime : రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతంలోని ఆదివాట్ గ్రామ సమీపంలో ఓ బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతు ఉంది. దానిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాలికపై అత్యాచారం చేసి, ఆపై రాయితో తలపై కొట్టి చెట్టుకు ఉరివేసినట్లు వెల్లడైంది. బాలిక వయస్సు 18 ఏళ్లు.

మృతురాలికి వివాహానికి నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె తనకు కాబోయే భర్తతో తరచు మాట్లాడేది. ఆమె కాబోయే భర్తతో మాట్లాడటాన్ని ముఖేష్ నానోమా అనే యువకుడికి నచ్చేది కాదు. ఎందుకంటే ఆమెను అతను ప్రేమించాడు. అలా ఆమెపై కక్ష పెంచుకున్న ముఖేష్ నానోమా ఓ రోజు కాపుకాసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆతరువాత ఆమెను బండరాయితో మోడి హత్య చేశాడు. తరువాత చెట్టుకువేలాడదీశాడు.

తలకు గాయాలు కావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 20 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆ బాలికను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలిపాడు. ఆమెకు నిశ్చితార్థం అయిందని తెలుసుకున్నానని..ఆ అబ్బాయితో మాట్లాడుతు కనిపించినప్పుడల్లా నాకు విపరీతమైన ఆగ్రహం కలిగేదని తెలిపాడు.నాకు దక్కని ఆమె ఎవ్వరికి దక్కకూడదని ఆమెపై అత్యాచారం చేసి చంపేశానని చెప్పాడు.

ఆమెను బావిలోకి తోసి చంపాలని ప్లాన్ చేశానని..కానీ కుదరలేదని చెప్పాడు. తరువాత ప్లాన్ మార్చుకున్నానని..ఆమెను ఇంటికి పిలిచి ఇంటికి కొంత దూరంలో ఉన్న పొలానికి తీసుకెళ్లి..ఆమెపై అత్యాచారం చేసి తలపై రాయితో కొట్టానని..ఆ తరువాత మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీశానని తరువాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు.

ఈ ఘటనపై దుంగార్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ జోషి మాట్లాడుతూ..బాలిక తలపై తీవ్ర గాయాలు ఉండటం..అత్యాచారానికి గురైందనే పోస్ట్ మార్టం రిపోర్టుతో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందా? లేదా వన్ సైడ్ లవ్వా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఆచూకీ 20 గంటల్లోనే తెలిసింది. వెంటనే అరెస్ట్ చేశామని తెలిపారు.