అందుకే : ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు

  • Publish Date - November 9, 2019 / 09:17 AM IST

సాధారణంగా మోటర్ సైకిళ్లు, కార్లు వంటి వాటిరి నంబర్ ప్లేట్లు ఉంటాయి. కానీ ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం గురించి విన్నారా? బహుశా విని ఉండరు. ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం..అవికూడా ప్రత్యేకమైన నంబర్ ప్లేట్లు ఉండటం విశేషం. ఈ విశేషం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పంచాయితీల్లో ఉంది. 

దేశంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ కంప్యూటర్ యుగంలో కూడా  సరైన రోడ్డు..రవాణా సదుపాయాలు లేని గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి. అటువంటి గ్రామాలకు ఎడ్లబళ్లే రవాణా సాధనంగా ఉన్నాయి. అటువంటి గ్రామాలు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ కు 125 కిలో మీటర్ల దూరంలో ఉన్న 33 గ్రామాలకు ఎడ్లబళ్లే రవాణా సాధనాలుగా ఉన్నాయి. ఆ ఎడ్ల బళ్లకు ‘నంబర్ ప్లేట్లు’ ఉండటం విశేషం. 

బీజాపూర్‌కు 125 కిలోమీటర్ల దూరంలోని సెండరా, పిల్లూర్‌తోపాటు నాలుగు పంచాయతీల పరిధిలోని 33 గ్రామాల్లో నంబర్ ప్లేట్లు ఉన్న ఎడ్ల బళ్లు కనిపిస్తాయి. ఆ గ్రామాల్లోని ప్రజలు ఈ ఎడ్ల బళ్ల నంబరు ప్లేటుపై ఉన్న వివరాలను తమ వద్ద ఉంచుకుంటారు. తమకు ప్రయాణం అవసరమైనప్పుడు ఆ ఎడ్ల బళ్లను బుక్ చేసుకుంటుంటారు. అంట అచ్చం మనం ఓలా..ఊబర్ ట్యాక్సీలను బుక్ చేసుకుంటాకదా అలాగన్నమాట. అదికూడా ఆన్ లైన్ లో కూడా మాన్యువల్ గానే అనే విషయం గమనించాలి. 

ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అత్యంత వెనుకబాటుతనంలో కొట్టుమిట్టాడుతున్న ఈ గ్రామాలకు ఎడ్ల బళ్లే రవాణా సాధనాలుగా ఉన్నాయి. ఈ నాటికీ ఈ ప్రాంతంలోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతీ రవాణా అవసరానికీ ఎడ్ల బళ్లపైనే ఆధారపడుతుంటారు. అందుకే ఈ ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా ఎడ్ల బళ్లే ప్రధాన రవాణా సాధనాలుగా ఉన్నాయి అంటే అభివృద్ధి గురించి ఇంకా గొప్పలు చెప్పుకుందామా..ఇకనైనా ఇటువంటి గ్రామాల అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టాలని ఆశిద్దాం.