Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Buss Accident

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్ లోని అల్మోరాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్చులా సమీపంలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పదిహేను మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలంకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: Srikanth Kidambi : సీఎం చంద్ర‌బాబును క‌లిసిన కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్య‌తో..

బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి బస్సు ప్రమాదం ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల కటుంబాలకు రూ. 4లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.