Cab Driver: స్లోగా వెళ్లమన్నాడని తెలుగు వ్యక్తి నుంచి డబ్బులు లాక్కొని దించేసిన పూణె డ్రైవర్

షేర్‌డ్ ట్రావెలింగ్ చేస్తున్న వ్యక్తి కాస్త స్లోగా వెళ్లమనడం తప్పు అయిపోయింది. అంతే మార్గం మధ్యలోనే దింపేయడంతో పాటు అతని వద్ద ఉన్న ఫోన్, డబ్బు మొత్తాన్ని లాగేసుకున్నాడు.

Cab Driver: స్లోగా వెళ్లమన్నాడని తెలుగు వ్యక్తి నుంచి డబ్బులు లాక్కొని దించేసిన పూణె డ్రైవర్

Express Way

Updated On : November 14, 2021 / 4:20 PM IST

Cab Driver: షేర్‌డ్ ట్రావెలింగ్ చేస్తున్న వ్యక్తి కాస్త స్లోగా వెళ్లమనడం తప్పు అయిపోయింది. అంతే మార్గం మధ్యలోనే దింపేయడంతో పాటు అతని వద్ద ఉన్న ఫోన్, డబ్బు మొత్తాన్ని లాగేసుకున్నాడు క్యాబ్ డ్రైవర్. పూణెలోని గహుంజె గ్రామంలో పూణ్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మీద ఈ దారుణం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన రవికుమార్ లీలానందమూర్తి పూల (43) అనే వ్యక్తి తలెగావ్ లో నుంచి పూణెకు బయల్దేరాడు. షేరింగ్ క్యాబ్ లో ప్రయాణిస్తున్న అతను కాస్త నిదానంగా వెళ్లమని చెప్పాడు. ప్రయాణికుడితో వాదన పెట్టుకున్న డ్రైవర్ కాసేపటికి కార్ ను గహుంజె ఫ్లై ఓవర్ మీద ఆపేశాడు. చేతిలో ఉన్న రూ.9వేలు క్యాష్, మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడు.

దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో ఇంటికి చేరుకోవడంతో పాటు.. ఆ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు బాధితుడికి న్యాయం చేశారు.

…………………………………………. : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..