Bengaluru : కొడుకుని చంపిన సీఈఓ కేసులో కీలక పాత్ర పోషించిన క్యాబ్ డ్రైవర్.. సుచనా సేథ్ ప్రవర్తన గురించి ఏం చెప్పాడంటే?

AI స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ 4 ఏళ్ల కొడుకుని హత్య చేసి తర్వాత గోవా నుండి కర్నాటకకు క్యాబ్ లో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమె ప్రవర్తన గురించి క్యాబ్ డ్రైవర్ అనేక విషయాలు వెల్లడించాడు.

Bengaluru

Bengaluru : గోవాలో 4 ఏళ్ల కొడుకుని హత్య చేసిన AI స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ కథనం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ కేసులో సేథ్‌ని పట్టుకోవడంలో క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సాయం అందించాడు. క్యాబ్‌లో ఉన్నప్పుడు సుచనా ప్రవర్తన .. ఆమెను పోలీసులకు అప్పగించడంలో ఎలాంటి సాయం అందించాడో తాజాగా క్యాబ్ డ్రైవర్ వివరాలు వెల్లడించాడు.

నాలుగేళ్ల కొడుకుని హత్య చేసిన ఆరోపణలపై AI స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఆమె పోలీసులకు పట్టుబడటానికి ముందు తన కొడుకు మృతదేహంతో గోవా నుండి కర్నాటకకు టాక్సీలో బయలుదేరారు. గోవాలోని ఒక సర్వీస్ అపార్ట్ మెంట్ నుండి సేథ్ కోసం క్యాబ్ బుక్ అయ్యింది. ఆ సమయంలో రిసెప్షన్‌లో ఉన్న బ్యాగ్‌ను క్యాబ్ వరకు తీసుకురమ్మని డ్రైవర్ జాన్‌ను సేథ్ కోరారట. అయితే అది చాలా బరువుగా ఉండటంతో తీసుకు రావడం కష్టమైందని జాన్ వెల్లడించాడు.

Bengaluru : కంపెనీ సీఈఓగా ఉంటూ కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తల్లి.. పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు

సేథ్ తన క్యాబ్ లో 10 గంటల పాటు ప్రయాణం చేసారని .. ఆ సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉన్నారని.. బిచోలిమ్ సిటీలో మాత్రం వాటర్ బాటిల్ కావాలని అడిగారని జాన్ చెప్పాడు. తనకు గోవా పోలీసుల నుండి కాల్ రావడంతో సేథ్ విషయంలో అప్రమత్తం అయ్యానని తెలిపాడు. బెంగళూరు నుండి కర్నాటక-గోవా సరిహద్దు అయిన చోర్ల ఘాట్ సెక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. క్లియర్ కావడానికి 6 గంటలు పడుతుందని విమానంలో వెళ్లవచ్చునని ఆమెకు సూచించినా ఆమె రోడ్డు మార్గంలో కొనసాగాలని పట్టుబట్టిందని జాన్ చెప్పాడు.

మరోవైపు జాన్‌ను కాంటాక్ట్ అయినా కలాంగుట్ పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కోసం వెతకమని సేథ్‌ను అక్కడికి తీసుకెళ్లమని చెప్పారట. గూగుల్ మ్యాప్, జీపీఎస్ ద్వారా వెతకడానికి ప్రయత్నించినా పోలీస్ స్టేషన్ కనుగొనలేకపోయానని.. టోల్ ప్లాజాల వద్ద పోలీసుల కోసం వెతికినా ఎవరూ కనిపించలేదని జాన్ చెప్పాడు. పోలీసుల నుండి కాల్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక నెపంతో రోడ్డుపక్కన ఆపి సమయం తీసుకున్నానని చివరికి కర్నాటక చిత్రదుర్గ జిల్లాలోని అయ్యమంగళ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లానని క్యాబ్ డ్రైవర్ జాన్ చెప్పాడు. పోలీసులు రావడానికి 15 నిముషాలు సమయం పట్టిందని అప్పటివరకు సేథ్ చాలా ప్రశాంతంగా కారులో కూర్చున్నారని అన్నాడు.

Viral Post : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా లేఖ

పోలీసులు వచ్చి బ్యాగ్ చూసేసరికి చిన్నారి మృతదేహం కనిపించిందని.. ఇది మీ కొడుకుదేనా? అని అడిగినపుడు ఆమె ప్రశాంతంగా అవునని సమాధానం చెప్పిందని జాన్ వెల్లడించాడు. తను తన భర్తతో దూరంగా ఉన్నానని.. విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని సేథ్ పోలీసులకు తెలిపిందట. వెంటనే పోలీసులు ఆమెను అరెస్టు చేసారు. సుచనా సేథ్ స్టార్ట్-అప్ మైండ్‌ఫుల్ AI ల్యాబ్ సీఈఓగా ఉన్నారు. అత్యున్నతమైన స్ధానంలో ఉండి ఇలాంటి పని చేసిన సుచనాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.