Bengaluru : కంపెనీ సీఈఓగా ఉంటూ కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తల్లి.. పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు
ఒక పెద్ద కంపెనీలో సీఈఓ ఉద్యోగం. కానీ క్రూరమైన ఆలోచనా విధానం. భర్తతో విడాకుల నేపథ్యంలో ఉన్న పగ కాస్త కొడుకు మీద చూపించింది. 4 సంవత్సరాల చిన్నారిని ఆ కన్నతల్లి చేతులతో చిదిమేసింది. ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.

Bengaluru
Bengaluru : కాపాడాల్సిన కన్నతల్లే కొడుకు పాలిట యముడిలా మారింది. నవమాసాలు మోసి కన్న బిడ్డను కనికరం లేకుండా హత్య చేసింది. చేసిన ఘోరం నుండి తప్పించుకునేందుకు ఆమె పోలీసుల ఎదుట చెప్పిన నిజాలు వింటే షాకవుతారు.
Bangaluru: ఇది రీల్ కాదు బాస్ రియల్.. బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ముక్కున వేలేసుకుంటారు
సుచనా సేథ్.. బెంగళూరుకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓ కన్న కొడుకుని చంపిన కేసులో వార్తల్లో నిలిచారు. నాలుగేళ్ల కొడుకును హోటల్ గదిలో దారుణంగా హత్య చేసారు. పోలీసుల విచారణలో ఆ లేడీ చెప్పిన నిజాలు వింటే అందరూ షాకవుతారు. సేథ్‌కు కేరళకు చెందిన ఆమె భర్తకు విడాకుల కేసు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నారు.
భర్తతో వివాదం.. కోర్టు కేసుల మధ్య సేథ్ కొడుకుని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్‌తో గోవా ట్రిప్ ప్లాన్ చేసి సోల్ బన్యన్ గ్రాండ్ హోటల్‌లో బస్ చేసారు. కొడుకుతో వచ్చిన సేథ్ తిరిగి వెళ్లేటపుడు బరువైన బ్యాగ్‌తో వెళ్లడం హోటల్ సిబ్బంది కనిపెట్టారు. దానికి తోడు ఆమె ఖాళీ చేసిన హోటల్ రూమ్‌లో రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు క్యాబ్‌లో బెంగళూరికి ప్రయాణిస్తున్న సేథ్‌కి ఫోన్ చేసారు. ఆమె కొడుకు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తన కొడుకు స్నేహితుల ఇంట్లో ఉన్నాడని సేథ్ వారికి చెప్పింది.
Bangaluru: ఇది రీల్ కాదు బాస్ రియల్.. బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ముక్కున వేలేసుకుంటారు
హోటల్ రూమ్ లో రక్తపు మరకల గురించి పోలీసులు ప్రశ్నిస్తే తాను పీరియడ్స్‌లో ఉన్న కారణంగా మరకలు అయ్యాయని బదులిచ్చింది సేథ్. సౌత్ గోవాలో తన స్నేహితుని వద్ద కుమారుడు ఉన్నాడంటూ సేథ్ ఇచ్చిన చిరునామా నకిలీదని పోలీసులు గుర్తించారు. సేథ్ తప్పించుకోకుండా పోలీసులు కొంకణిలో క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడి ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలని కోరారు. అప్పుడే ఆమె బ్యాగులో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో వెంటనే సేథ్‌ను అరెస్టు చేసారు. మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ సీఈవోగా ఉన్న సేథ్‌ను గోవాలోని మపుసా కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెకు ఆరు రోజుల కస్టడీ విధించింది.