Viral Post : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా లేఖ

ఇటీవల కాలంలో ఉద్యోగుల రాజీనామా లేఖలు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. చర్చకు దారి తీస్తున్నాయి. ఓ పెద్ద కంపెనీలో సీఎఫ్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ఇచ్చిన రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Post : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా లేఖ

Viral Post

Updated On : December 22, 2023 / 4:09 PM IST

Viral Post : ఉద్యోగంలో రాజీనామా చేయడం పెద్ద వార్త కాకపోవచ్చు. కానీ ఓ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా చేస్తూ ఇచ్చిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతగా ఆ లేఖలో ఏముంది అనుకుంటున్నారా? చదవండి.

ముంబయికి చెందిన మిత్షీ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రింకూ నికేత్ పటేల్ డిసెంబర్ 15 న తన పదవికి రాజీనామా చేసారు. మేనేజింగ్ డైరెక్టర్‌కి తన లేఖను సమర్పించారు. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఆయన రాజీనామా లేఖను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. రిజిగ్నేషన్ లెటర్‌ను స్కూల్ నోట్ బుక్ డబుల్ రూల్డ్ పేపర్‌పై రాయడం ఆసక్తికరంగా మారింది. ‘గౌరవంతో .. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను తక్షణమే CFO ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. మీ సంస్థ కోసం పనిచేయడం చాలా ఆనందంగా అద్భుతమైన అనుభవంగా ఉంది’ అంటూ తన చేతి రాతతో రింకూ రాజీనామా లేఖను రాసుకొచ్చారు.

Viral Post

Viral Post

Bigg Boss 7 Telugu Grand Finale: ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు.. వైరల్ అవుతున్న గ్రాండ్ ఫినాలే ఫొటోస్

రింకూ రాజీనామా లేఖను బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) తన వెబ్ సైట్లో పంచుకుంది. వ్యక్తిగత కారణాల వల్ల రింకూ నికేత్ పటేల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారని మిత్షి ఇండియా లిమిటెడ్ తన ప్రకటనలో తెలిపింది. కొత్త CFO నియమించే పనిలో ఉన్నామని, ఆ స్ధానం భర్తీ చేశాక స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. రింకూ రాజీనామా లేఖ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.