Railway Employees: రైల్వే శాఖ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. నాన్-గెజిటెడ్ సిబ్బందికి 78 రోజుల బోనస్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్
ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ)గా దీన్ని అందించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 11.27 లక్షల మంది సిబ్బందికి మేలు కలుగుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ బోనస్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్ అందుతుంది. దీని ద్వారా ప్రతి ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 వరకు అందే అవకాశం ఉంది. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్ల అభివృద్ధిలో సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ‘‘కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో కూడా రైల్వే సిబ్బంది నిరంతరాయంగా పనిచేశారు.
Chinese Visas: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్థులకు చైనా వీసా
ఆహారోత్పత్తులు, ఫెర్టిలైజర్లు, బొగ్గు, ఇతర ఉత్పత్తులు అన్ని ప్రాంతాలకు చేరడంలో కీలకపాత్ర పోషించారు. తమ పనుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా, కొరత రాకుండా చూసుకున్నారు’’ అని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత మూడేళ్లుగా రైల్వే శాఖ లాభాల్లోకి వచ్చేందుకు, ఆర్థికంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రకటించిన బోనస్ వల్ల రైల్వే శాఖపై రూ.1,832 కోట్ల భారం పడనుంది.