కరోనావైరస్‌తో అలాగే భవిష్యత్తులో జంతువుల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉన్న అన్ని రకాల కరోనావైరస్లకు వ్యాక్సిన్ పరీక్షను ప్రారంభించాలని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కరోనాతోపాటు ఆ జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌లను ఎదుర్కొనే టీకాను తయారు చేయటానికి కృషి చేస్తున్నట్లు కేంబ్రిడ్జి యూనివర్సిటీ తెలిపింది.
కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌ల జన్యుక్రమాలను ఉపయోగించి డీఐవోఎస్-కోవాక్స్2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, దానిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని, ట్రయల్స్ విజయవంతమైన తర్వాత.. రోగులకు నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్ పవర్డ్ జెట్ ఇంజిక్షన్’ (సూది లేకుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం) ద్వారా ఈ టీకాను వేస్తామని తెలిపింది.బ బబఇది గబ్బిలాల ద్వారా వ్యాపించే కరోనావైరస్‌ను కూడా కలిగి ఉంబదని, మానవులకు వ్యాపించే అనేక రకాల కరోనావైరస్‌లపై ఇది పోరాటం చేస్తుందని చెప్పింది.https://10tv.in/sonu-sood-offers-accommodation-20000-migrant-workers-noida/
‘కొవిడ్-19 వైరస్ నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్ మోడలింగ్ ద్వారా విశ్లేషించి టీకాను అభివృద్ధి చేసినట్లు వారు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వైరల్ జునోటిక్స్ ప్రయోగశాల అధిపతి మరియు డియోసినావాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ జోనాథన్ హీన్ దీని గురించి సమాచారం ఇచ్చారు. SARS, మార్స్ మరియు జంతువుల కుటుంబం నుంచి వచ్చే వైరస్, ఇతర కరోనావైరస్‌ల సమాచారాన్ని ఇది కలిగి ఉందని అన్నారు. జంతువుల నుండి మానవులకు భవిష్యత్తులో కూడా అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఈ టీకా దానిపై పోరాటానికి పనికి వస్తుందని ఆయన వెల్లడించారు.