Canada : కెనాడాలో శాశ్వత నివాసం…భారతీయులే టాప్ ప్లేస్

గత కొన్నేళ్లుగా కెనాడాలో శాశ్వత నివాసం పొందుతున్న వారిలో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన వారిలో...

Canada

Canada And India : విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్న వారు కెనడా వైపు చూస్తున్నారు. అక్కడే కరెక్టు అనుకుని..పర్మినెంట్ గా అక్కడే ఉండిపోతున్నారు. విదేశాల్లో సెటిల్‌ అవాలనుకునే వారికి కెనడా ఫైనల్ డెస్టినేషన్‌గా మారుతోంది. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా కెనడా తమ దేశానికి ఆహ్వానిస్తోంది. ఇలాంటి వారి కోసం పాయింట్‌ బేస్డ్ పర్మినెంట్ రెసిడెంట్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే కెనడాలో తాత్కాలిక నివాసితులుగా ఉన్న వారికి ఇది ఉపయోగకరంగా మారింది. దీంతో వలసదారులకు కెనడా స్వర్గధామంగా మారుతోంది.

Read More : Omicron In India : దేశంలో 422కు చేరిన ఒమిక్రాన్ కేసులు

వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వివిధ దేశాలకు చెందిన నాలుగు లక్షల వెయ్యి మంది వలసదారులు కెనడాలో శాశ్వత నివాసితులుగా మారారు. ఈ నాలుగు లక్షల మందిలో 40 శాతం మంది భారతీయులే ఉండటం విశేషం. భారత్‌, చైనా, నైజీరియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన స్కిల్డ్ వర్కర్స్‌కు కెనడాలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇమిగ్రేషన్- రిఫ్యూజీస్ -సిటిజిన్‌షిప్ కెనడా లెక్కల ప్రకారం గతేడాది 51వేల 841 మంది భారతీయులకు పర్మినెంట్ రెసిడెన్స్‌గా మారేందుకు కెనడా అవకాశం కల్పించింది. ఆ ఏడాది మొత్తం అప్లికేషన్స్‌లో అది 47 శాతం.

Read More : Corona New Cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భయపెట్టేస్తున్న ఒమిక్రాన్!

గత కొన్నేళ్లుగా కెనాడాలో శాశ్వత నివాసం పొందుతున్న వారిలో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉండటంతో శాశ్వాత నివాసాల విషయంలోనూ వాళ్లకే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. రానున్న సంవత్సరాల్లో కూడా ఇమిగ్రెంట్స్‌కు కెనడా ప్రభుత్వం పెద్ద పీట వేయబోతోంది. వచ్చే ఏడాది నాలుగు లక్షల 11 వేల మందికి, 2023లో నాలుగు లక్షల 21 వేల మందికి శాశ్వత నివాసాలు కల్పించాలని కెనడా ప్రభుత్వం భావిస్తోంది.