UP Journalist : రామ మందిర ట్రస్ట్ బోర్డ్ సెక్రటరీపై భూ కబ్జా ఆరోపణలు..జర్నలిస్ట్ పై కేసు నమోదు
అయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Champat Rai
UP Journalist అయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ రాయ్‌పై తప్పుడు ఆరోపణలు చేయడానికి కుట్ర పన్నారని, ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ లీడర్ మరియు రామ మందిర ట్రస్ట్ సెక్రటరీ అయిన చంపత్ రాయ్ సోదరుడు సంజయ్ భన్సాల్ ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్ వినీత్ నరైన్ మరియు అల్కా లహోతి మరియు రజనిష్ లపై ఐపీసీలోని 15 సెక్షన్లు, ఐటి చట్టంలోని మూడు సెక్షన్ల కింద బిజ్నోర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జర్నలిస్ట్ వినీత్ నరైన్ మరియు మరో ఇద్దరు మతం ప్రాతిపదికగా శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని,తప్పుడు ఆధారాలను అందిస్తున్నారని,చీటింగ్,అతిక్రమణ సహా పలు సెక్షన్ కింద వారిపై ఎఫ్ఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా, మూడు రోజుల క్రితం జర్నలిస్ట్ జర్నలిస్ట్ వినీత్ నరైన్ ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. బిజ్నోర్ జిల్లాలోని తమ స్వగ్రామంలో ఎన్ఆర్ఐ అల్కా లహోతికి చెందిన 20వేల స్వ్కేయర్ మీటర్ల భూమిని ఆక్రమంగా లాక్కోవడానికి చాంపత్ రాయ్ తన సోదరులకు సాయపడ్డారని జర్నలిస్ట్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో ఆరోపించిన విషయం తెలిసిందే. లహోతి 2018 నుండి ఆ ఈ విషయమై పోరాడుతున్నారని మరియు దీనిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశారని జర్నలిస్ట్ తెలిపారు.
అయితే ల్యాండ్ విషయంలో ఆరోపణలపై ప్రాథమిక విచారణ ఆధారంగా చంపత్ రాయ్ అతని సోదరుడికి బిజ్నోర్ పోలీస్ చీఫ్ డాక్టర్ ధరమ్ వీర్ సింగ్ ఇప్పటికే క్లీన్ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని..అన్ని నిజాలను నిర్థారిస్తున్నామని బీజ్నోప్ పోలీస్ చీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు.