×
Ad

Ramdev : రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై పోలీసు కేసు

మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసుపై విచారించాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టు రామ్‌దేవ్‌ను అక్టోబర్ 5వతేదీన బార్మర్ చోహ్తాన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుపర్చాలని ఆదేశించింది....

  • Published On : September 14, 2023 / 05:15 AM IST

Ramdev

Ramdev : మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసుపై విచారించాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టు రామ్‌దేవ్‌ను అక్టోబర్ 5వతేదీన బార్మర్ చోహ్తాన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుపర్చాలని ఆదేశించింది. (Case Against Ramdev) అక్టోబర్ 16న కేసు డైరీని కోర్టులో సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. రద్దు చేయాలంటూ రామ్‌దేవ్ దాఖలు చేసిన క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ కుల్దీప్ మాథుర్ ఈ ఆదేశాలు ఇచ్చారు.

Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

అక్టోబరు 5వతేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ అధికారి ముందు హాజరు కావాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. మునుపటి విచారణ సందర్భంగా రామ్‌దేవ్ అరెస్టుపై కోర్టు స్టే విధించింది. మే 20వతేదీ లేదా అంతకంటే ముందు విచారణ కోసం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కానీ అతను దర్యాప్తు అధికారి ముందు హాజరు కాలేదు.

Libya Floods : లిబియా వరద బీభత్సంలో 5,000 దాటిన మృతుల సంఖ్య

ఫిబ్రవరి 2వతేదీన బార్మర్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పథాయ్ ఖాన్ ఫిబ్రవరి 5వతేదీన బార్మర్‌లోని చోహ్తాన్ పోలీస్ స్టేషన్‌లో యోగా గురువుపై ఫిర్యాదు చేశారు. (Hurting Religious Sentiments) విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను కించపరిచేలా వ్యవహరించడం వంటి అభియోగాల కింద ఛోహ్తాన్ పోలీసులు రాందేవ్ బాబాపై కేసు నమోదు చేశారు. రామ్‌దేవ్ తన వ్యాఖ్యలు కోట్ల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయని ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.