Pooja Shakun Pandey: శుక్రవారం నమాజ్ నిషేదించాలని కామెంట్ చేసిన నేత అరెస్ట్
అఖిల భారత హిందూ మహా సభ జాతీయ సెక్రెటరీ పూజ సకున్ పాండే కు సమన్లు ఇష్యూ చేశారు. శుక్ర వారం ప్రార్థనలను నిషేదించినందుకు గానూ పలు సెక్షన్ల పై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంలోని పరిస్థితులపై దుష్ చూపే అవకాశం ఉందని అన్నారు.

Pooja Shakun Pandey
Pooja Shakun Pandey: అఖిల భారత హిందూ మహా సభ జాతీయ సెక్రెటరీ పూజ సకున్ పాండే కు సమన్లు ఇష్యూ చేశారు. శుక్ర వారం ప్రార్థనలను నిషేదించినందుకు గానూ పలు సెక్షన్ల పై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంలోని పరిస్థితులపై దుష్ చూపే అవకాశం ఉందని అన్నారు.
సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కళానిధి నైతని మాట్లాడుతూ.. మతపరమైన చిచ్చురేపే వ్యాఖ్యలకు గాను గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
పాండే.. తాను ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశానని శుక్రవారం ప్రార్థనలు దేశంలోని శాంతి భద్రతలకు ఆటంకం గా మారే అవకాశం ఉందని, వాటిని నిషేధించాలని కోరినట్లు తెలిపారు.
Read Also: నుపుర్ శర్మకు భద్రత.. ముంబ్రా పోలీసుల సమన్లు
సిరి అదనపు మెజిస్ట్రేట్ బహదూర్ కున్వర్ సింగ్ సైతం పాండేకి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల త్వరగా స్పందించి తగిన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.