Nupur Sharma: నుపుర్ శర్మకు భద్రత.. ముంబ్రా పోలీసుల సమన్లు

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మకు తాజాగా ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మహారాష్ట్రలోని థానె జిల్లా ముంబ్రా పోలీసులు శర్మకు సమన్లు ఇచ్చారు.

Nupur Sharma: నుపుర్ శర్మకు భద్రత.. ముంబ్రా పోలీసుల సమన్లు

Nupur Sharma

Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మకు తాజాగా ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మహారాష్ట్రలోని థానె జిల్లా ముంబ్రా పోలీసులు శర్మకు సమన్లు ఇచ్చారు. ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. మహ్మద్ ప్రవక్తపై ఇటీవల నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, విమర్శలు ఎదురయ్యాయి. దీంతో నుపుర్ శర్మను బీజేపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినా వివాదం సద్దుమణగలేదు.

Apple MacBook: వచ్చే నెలలో రానున్న మ్యాక్‌బుక్.. ఖరీదు లక్షన్నర!

ఈ అంశం మెల్లిగా అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అనేక ఇస్లాం దేశాలు ఈ అంశంలో భారత్‌పై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా నుపుర్ శర్మకు ఇస్లామిక్ సంస్థల నుంచి బెదిరింపులూ ఎదురయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీసులు శర్మకు భద్రత కల్పించారు. నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పకుంటే తీవ్రవాద దాడులకు తెగబడతామని పలు సంస్థలు హెచ్చరించాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.