Redmi 15 5G: రెడ్‌మీ 15 5జీ వచ్చేసింది బాస్.. 7,000mAh బ్యాటరీ.. తక్కువ ధర.. కొనకపోయినా సరే ఈ ఫీచర్ల గురించి తెలుసుకోవాలంతే..
రెడ్‌మీ 15 5జీకి 6.9-ఇంచ్ Full-HD+ (1,080×2,340 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వచ్చింది.

Redmi 15 5G
Redmi 15 5G: రెడ్‌మీ 15 5జీ మంగళవారం ఇండియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 33W ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్ పవర్ ఇస్తోంది.
రెడ్‌మీ 15 5జీ 144Hz డిస్ప్లే ఉంది. కళ్ల రక్షణ కోసం 3 TÜV Rheinland సర్టిఫికేషన్స్ పొందింది. హ్యాండ్‌సెట్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పై రన్ అవుతుంది. గూగుల్ జెమినీ, Circle to Search వంటి AI ఫీచర్స్ ఉన్నాయి.
రెడ్‌మీ 15 5జీ ధర
రెడ్‌మీ 15 5జీ ధర ఇండియాలో రూ.14,999 నుంచి స్టార్ట్ అవుతుంది (6GB + 128GB). 8GB + 128GB వెర్షన్ రూ.15,999, 8GB + 256GB వెర్షన్ రూ.16,999. ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్, షియోమీ ఇండియా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్ లో ఆగస్ట్ 28 నుంచి అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మీ 15 5జీ ఫీచర్స్
రెడ్‌మీ 15 5జీకి 6.9-ఇంచ్ Full-HD+ (1,080×2,340 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వచ్చింది. టీయూవీ Rheinland సర్టిఫికేషన్స్ (లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సర్కేడియన్ ఫ్రెండ్లీ) ఉన్నాయి.
రెడ్మి 15 5జి కి Snapdragon 6s Gen 3 SoC ఉంది. దీనితో 8GB వరకు LPDDR4x RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందుతుంది. HyperOS 2.0 (Android 15 ఆధారంగా) పై రన్ అవుతుంది. 2 సంవత్సరాల మేజర్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి. గూగుల్ జెమినీ, Circle to Search వంటి AI ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సెక్షన్ లో, రెడ్‌మీ 15 5జీకి AI-బ్యాక్డ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. AI Sky, AI Beauty, AI Erase వంటి ఫీచర్స్ ఉన్నాయి. డాల్బీ సర్టిఫైడ్ స్పీకర్స్ ఉన్నాయి. ( Redmi 15 5G)
18W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
రెడ్‌మీ 15 5జీ కి 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. IP64 రేటింగ్ (డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్) ఉంది. IR Blaster తో వచ్చింది. కనెక్టివిటీ ఆప్షన్స్ – 5జి, 4జి, బ్లూటూత్, వైఫై, GPS, USB Type-C పోర్ట్. ఫోన్ సైజు 168.48×80.45×8.40mm, వెయిట్ 217గ్రాములు.